Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహంలా బతికిన నేనూ కొజ్జాలా పరుగెత్తా : జేసీ దివాకర్ రెడ్డి

సింహంలా బతికిన నేను కొజ్జాలా పరుగెత్తాల్సి వచ్చిందంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డివ్యాఖ్యానించారు. తమ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, తమను కించపరిచేలా మాట్లాడితే నాలుక

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (09:23 IST)
సింహంలా బతికిన నేను కొజ్జాలా పరుగెత్తాల్సి వచ్చిందంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డివ్యాఖ్యానించారు. తమ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, తమను కించపరిచేలా మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తామంటూ అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, కదిరి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలపై జేసీ దివాకర్ ఘాటుగానే స్పందించారు.
 
ఇదే అంశంపై జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఓయ్‌ మాధవ్‌... నన్నే హెచ్చరించే మగాడివా! నా నాలుక కోస్తావా! సినిమాల్లోలాగా మీసం తిప్పితే మగాడివైపోతావా! నువ్వు ఖాకీ విడిచి రా, నేను ఖద్దరు విడిచి వస్తా! నాలుక ఎక్కడ కోస్తావో చెప్పు... అక్కడికే వస్తా అంటూ సవాల్ విసిరారు. 
 
'నా చుట్టూ తిరిగే వాడివి.... నన్నే బెదిరిస్తావా! కొజ్జాలకూ, ఆడామగా కానోళ్లకూ మీసాలుంటాయి. నీకు దమ్మూ ధైర్యం ఉంటే... రా చూసుకుందాం' అంటూ వ్యాఖ్యానించారు. పైగా, తాను ఏ ఒక్కర్నీ ఉద్దేశించి కొజ్జా అనలేదన్నారు. అలా అనుకుని ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. 
 
'చిన్నపొడమల ఘటనలో ప్రబోధానంద స్వామి భక్తులు తరిమితరిమి కొట్టారు. పోలీసులు నెత్తిపైన పెద్ద కిరీటాలూ... బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచాలు... చేతిలో లాఠీలు... పెద్దపెద్ద గన్నులు ఉన్నా కొజ్జాల్లా పరిగెత్తారు. 45 ఏళ్లు రాజకీయాల్లో సింహంలా బతికిన నేనూ కొజ్జాలా పరిగెత్తాల్సి వచ్చింది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగినపుడు 200 మంది పోలీసులున్నారు.. వారికూడా పారిపోతే వారిని ఏమనాలో మీరే చెప్పండి అంటూ మీడియాను జేసీ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments