Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరూ కృష్ణార్జునులు వంటివారు.. రజనీకాంత్ కితాబు

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:26 IST)
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ భారతీయ జనతా పార్టీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వయాన్ని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు హోంమంత్రి అమిత్‌షా, రజినీకాంత్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య పరిష్కారంలో బీజేపీ విజయవంతమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. అంతేకాదు మోదీ, షాలు కృష్ణార్జునులవంటివారని రజినీకాంత్ అభివర్ణించారు.
 
కాశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి, ఆర్టికల్ 370లను ప్రస్తావించిన రజనీకాంత్, ఈ విషయంలో తనకు చాలా సంతోషం కలిగిందని, వారిద్దరూ కలిసి కాశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని కొనియాడారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments