Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్ - అకీరాను అలా పిలవకండి.. ఆ ముగ్గురికి నచ్చదు.. వాళ్లెవరు?

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొట

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (15:06 IST)
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటో నిశితంగా పరిశీలిస్తే రేణూకు భాగస్వామి దొరికాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరూ చేయిపట్టుకున్న ఫొటోను పోస్ట్ చేయడంతో అది ట్రెండింగ్ అయ్యింది. 
 
తాజాగా రేణూ దేశాయ్ తన కుమారుడు అకీరా ఫోటోను పోస్టు చేశారు. ఆ ఫోటోతో పాటు తన క్యూటీ చూసేందుకు యూరోపియన్ సినిమాలోని ఓ సీరియస్ క్యారెక్టర్‌లా వున్నాడని చెప్పారు. ఓ గేమ్ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడని రేణూ దేశాయ్ చెప్పింది.
 
అయితే, ఎవరైనా త‌న కుమారుడిని జూనియర్ పవర్ స్టార్‌ అంటూ కామెంట్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా ఖాతాలను తన ఫాలోవర్ల లిస్టు నుంచి డిలీట్‌ చేయించి, బ్లాక్‌ చేయిస్తానని హెచ్చ‌రించింది. జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం త‌న కుమారుడు అకీరాకు, అలాగే అత‌డి నాన్నకు, అమ్మనైన త‌నకు ఇష్టం లేదని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఫాలోవ‌ర్లు అలా అనడం ఆపాల‌ని హెచ్చ‌రించింది. 
 
రేణూ దేశాయ్ కామెంట్స్‌పై నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కుమారుడిని జూనియర్ అనకూడదని చెప్పడం సబబు కాదని కొందరు అంటుంటే.. సరిగ్గా చెప్పారని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది.. రేణూ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతోందని.. అందుకే పవన్ ఫ్యామిలీని పూర్తిగా పక్కనబెట్టేయాలనుకుంటున్నట్లు భావిస్తోందని చెప్తున్నారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments