Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమా హైదర్-సచిన్‌లకు ఆఫర్లు.. గుజరాత్ నుంచి ఈ దంపతులకు జాబ్స్

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (11:56 IST)
Seema-Sachin
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పాకిస్తానీ మహిళ సీమా హైదర్-సచిన్ మీనా గురించి వార్తలు తెరపైకి వచ్చిన తర్వాత, ఈ జంటకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంటకు మొదట చలనచిత్ర నిర్మాత అమిత్ జానీ నుండి అతని చిత్రంలో పని చేయడానికి ఆఫర్ వచ్చింది.
 
ప్రస్తుతం సీమా-సచిన్‌లకు గుజరాత్ నుండి ఒక లేఖ వచ్చింది. అందులో ఒక వ్యాపారవేత్త వారికి ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలు ఇచ్చారు. దంపతులు ఎప్పుడైనా వచ్చి ఉద్యోగంలో చేరవచ్చని లేఖలో పేర్కొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. దంపతులకు సోమవారం రబుపురా పోస్టాఫీసు నుంచి కవరు వచ్చింది. కవరుపై గుజరాత్ చిరునామా రాసి ఉంది.
 
 ఆఫర్ లెటర్‌తో కూడిన కవరును మంగళవారం పోలీసుల సమక్షంలో దంపతులు ఓపెన్ చేసి చూశారు. సీమా, సచిన్ ఇద్దరికీ నెలకు రూ.50,000 జీతం ఇస్తానని గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆఫర్ లెటర్‌లో పేర్కొన్నాడు. 
 
ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఉద్యోగంలో చేరవచ్చని కూడా ఆఫర్ లెటర్‌లో రాసి ఉంది.
 
వ్యాపారవేత్త ఎవరనేది ఇంకా వెల్లడించలేదు.
 
 సీమా-సచిన్ ఇద్దరూ పోలీసుల నిఘాలో ఉన్నారు. ఉద్యోగం లేకపోవడంతో ఈ జంట ఆర్థిక కష్టాల్లో వున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments