ప్రియురాలు ఆ పని చేయడంతో అర్థరాత్రి అల్లాడిపోయిన చెన్నై ప్రియుడు

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (20:53 IST)
అతడు ఉద్యోగరీత్యా వుండేది చెన్నై మహానగరంలో. కానీ ప్రేయసి కోసం ఒడిశా వెళ్తుంటాడు. ఎందుకంటే అతడి స్వగ్రామం కూడా ఒడిశా లోని కియోంజర్ జిల్లా బదుగావ్ గ్రామం. వివరాల్లోకి వెళితే... 25 ఏళ్ల రాజేంద్ర నాయక్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే అప్పుడప్పుడు తన స్వంత వూరికి కూడా వెళ్తుంటాడు. అక్కడ అతడికి ప్రియురాలు వుంది. సొంత ఊరుకి వెళ్లడంతో పాటు ప్రేయసితో కూడా గడపడం చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంటికి వెళ్లాడు. 
 
అర్థరాత్రి ఇద్దరి మధ్య ఏదో విషయంపై గొడవ వచ్చింది. ఐతే ఆ గొడవ ముగియగానే ప్రియుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కానీ ప్రేయసికి మాత్రం నిద్రపట్టలేదు. దీనితో అతడిపై కసితో రగిలిపోయిన సదరు మహిళ వంటింట్లో వున్న పదునైన కత్తి తీసుకుని వచ్చి అతడి మర్మాంగాన్ని ఒక్కవేటుతో కోసేసింది. అతడు చావు కేకలు పెట్టాడు. 
 
ఆ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా రక్తపు మడుగులో అతడు కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా వున్నట్లు వైద్యులు చెప్పారు. ఐతే ఘాతుకానికి పాల్పడ్డ మహిళపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments