కేరళలో ప్రమాదం తప్పింది.. పిట్టగోడ వద్ద నిల్చుని వుంటే పడిపోయాడు.. (video)

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (15:15 IST)
Man
కేరళలో ప్రమాదం తప్పింది. కేరళలోని ఓ ప్రభుత్వ కార్యాలయం ముందు కొందరు క్యూలో నిల్చుని వున్నారు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి కిందపడపోయాడు. అంతే పక్కన నిల్చున్న వ్యక్త ఆ వ్యక్తిని కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేరళలో జరిగిన ఈ సంఘటన అక్కడి సీసీ కెమోరాలో రికార్టు అయ్యింది. ఈ వీడియోను దివ్వ అర్జున్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ శుక్రవారం షేర్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఓ ప్రభుత్వం కార్యాలయం ముందు కొంతమంది క్యూలో నిలుచుని ఉన్నారు. అయితే ఆ ఆఫీసు ఓ అపార్టుమెంటులోని మొదటి అంతస్తులో ఉంది. ఈ నేపథ్యంలో పని మీద అక్కడికి రెడ్‌ షర్ట్‌ ధరించిన వ్యక్తితో పాటు మరికొందరూ వచ్చారు. వారంత ఆఫీసు బయట పిట్ట గోడ వద్ద నిలుచుని ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది సమయానికి అకస్మాత్తుగా ఆ వ్యక్తి కళ్లు తిరగడంతో ఉన్నచోటనే వెనక్కి వెల్లకిల ఆ పిట్ట గోడపై నుంచి కిందకు పడబోయాడు.
 
పక్కనే ఉన్న మరో వ్యక్తి అప్రమత్తమై అతడు పడిపోకుండా పట్టుకున్నాడు. అది చూసిన ఆఫీసు సిబ్బంది హుటాహుటిన బయటకు పరుగెత్తుకుంటు వచ్చి అతడికి సాయం చేశారు. చివరకు ఎలాగోలా ఆ వ్యక్తిని పైకి లాగి రక్షించారు. ఇది చూసిన నెటిజన్లు ఓ మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఆతనిని కాపాడిన వ్యక్తిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MAA: మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ను దుర్వినియోగం చేసేవారికి హెచ్చరిక

శ్రీదేవితో పెళ్లి చేయాలనుకున్నారు.. జీవిత మాట విని షాక్ అయ్యాను.. రాజశేఖర్

Susmita: పెద్ది కార్ ని పరిశీలించి ప్రమోషన్ టీమ్ ను అభినందించిన సుస్మిత కొణిదెల

Rashmika: కెచ మాస్టర్ ఆధ్వర్యంలో కేరళలో మైసా యాక్షన్ షెడ్యూల్ పూర్తిచేసిన రష్మిక మందన్న

Trisha: సూర్య, త్రిష జంటగా నటించిన వీరభద్రుడు సెన్సార్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

తర్వాతి కథనం
Show comments