Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్స్ రైలు కింద ఓ పిల్లాడు చిక్కుకున్నాడు.. ఏమైందంటే? (video)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (14:43 IST)
గూడ్స్ రైలు కింద ఓ పిల్లాడు చిక్కుకున్నాడు. ఆ గూడ్స్ రైలు పిల్లాడిపై నడుచుకుంటూ పోయింది. కొంతదూరంలో ఓ పిల్లాడు పట్టాలపై ఆడుకుంటూ కనిపించాడు. హారన్ గట్టిగా మోగించినా పక్కకు తప్పుకోలేదు. అతడిని ఎలాగైనా కాపాడాలని ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు లోకో పైలట్లు. ట్రైన్ కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. కానీ అప్పటికే బాబు మీద నుంచి వెళ్లిపోయింది.
 
రైలు ఆగిన వెంటనే ఇంజిన్ నుంచి ఇద్దరు లోకో పైలట్లు దిగి పట్టాలను పరిశీలించారు. ఇంజిన్ కింది భాగంలో చిక్కుకుపోయిన పిల్లాడు.. ఏడుస్తూ.. భయపడుతూ కనిపించాడు. అంతేతప్ప ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగానే ఉన్నాడు. ఇంజిన్ కింద భాగంలో ఉండిపోయిన బాలుడిని లోకో పైలట్లు చాకచాక్యంగా బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాబ్‌గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 14 ఏళ్లు బాలుడు రెండేళ్ల తన తమ్ముడితో కలిసి ఆడుకున్నాడు. ఆ తర్వాత అతడు వెళ్లిపోవడంతో.. రెండేళ్ల బాలుడు నడుచుకుంటూ పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో రైలు దూసుకొచ్చింది. లోకో పైట్ల ధీవన్, అతుల్ చాకచక్యంగా బ్రేకులు వేయంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments