Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైమ్‌కి అన్నం పెట్టవా.. ప్లేటు విసిరేస్తూ యజమానిపై అరిచిన శునకం (Video)

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:14 IST)
Dog
సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. తాజాగా ఓ కుక్క వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుసామి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. దీనికి 'నాకు ఆకలి వేసిన 0.5 మెక్రో సెకన్ల తర్వాత' అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను చూసినట్లయితే ఒక కుక్క తన యజమాని దగ్గరికి వెళ్లి బాగా అరుస్తుంది. టైమ్‌కి ఆహారం పెట్టడం తెలియదా అన్నట్లు అరుస్తూ ప్లేటును విసిరేస్తుంది. 
 
ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. టైమ్‌కి అన్నం పెట్టండని కొందరు, ఆకలితో ఉన్న కుక్కతో పరాచకాలు ఆడొద్దు.. కరిస్తే ప్రమాదమే అంటూ మరికొందరు..  ఈ వీడియో పెదాలపై చిరునవ్వు తెస్తోంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 
కాగా, ఇప్పటివరకు 4 లక్షలపై వీవర్స్ చూశారు. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి ఈ వీడియోను ఏప్రిల్ 5వ తేదీన అప్లోడ్ చేశారు. లైకులు, రీట్విట్, కామెంట్లతో ఈ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments