పవన్ కు నేను పిచ్చి ఫ్యాన్

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (07:24 IST)
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పేరు లేకుండా తన సినిమాలేవి ఉండవని, అందుకే తన ప్రతి సినిమాలో పవన్‌కల్యాణ్ పేరు వచ్చేట్టు సూచించామని హీరో నితిన్ తెలిపారు. పవన్‌కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. శ్రేష్ట్‌మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మించిన చిన్నదాన నీ కోసం చిత్రం ఆడియో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో శనివారం రాత్రి తిరుపతిలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ, తాను నటించిన తాజా చిత్రం చిన్నదాన నీకోసం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెండువారాలుగా టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. 12 వరుస ప్లాప్‌ల తర్వాత విడుదలైన ఇష్క్ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు పవన్‌కల్యాణ్ వచ్చి తనను ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. 
 
దేవుడే పవన్‌కల్యాణ్ రూపంలోవచ్చి విజయం అందించారని తెలిపారు. పవన్‌కల్యాణ్, కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితోనే సినిమారంగానికి వచ్చానని చెప్పారు. హీరోయిన్ మిస్త్రి మాట్లాడుతూ ఈ చిత్రం వందశాతం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చె ప్పారు.  మాట్లాడుతూ నితిన్‌తో తనది నాల్గవ చిత్రమన్నారు. 
 
ఈ కార్యక్రమానికి హీరో నితిన్ తో హీరోయిన్ మిస్త్రీ, నిర్మాత నిఖితా రెడ్డి, డెరైక్టర్ కరుణాకరన్‌తో పాటు ఆలి, నరేష్, జోష్ రవి, మధు, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌తో పాటు చిత్రం యూనిట్ మొత్తం హాజరైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments