Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమృతవర్షిణి ఎస్. జానకి పుట్టిన రోజు

Webdunia
కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన ఎస్. జానకికి నేడే పుట్టిన రోజు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా 30వేల పాటలకు పైగా ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు.

శ్రీకృష్ణుడు, సాయిబాబా భక్తులారైన జానకి.. మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్లను విడుదల చేసింది. అలనాటి గాయకుడు ఘంటసాల పాటలకు గాయనిగా స్వరాన్నిచ్చి.. నేటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వరకు మధురమైన స్వరంతో సంగీత సముద్రంలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న జానక ి.. గుంటూరు జిల్లాల్లో పుట్టారు.

నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏటనే గాయనిగా అవతారమెత్తారు. మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి.. తెలుగులో హిట్ అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తమిళం, తెలుగు సినిమాల కోసం తానే స్వయంగా పాటలు రాశారు.

హిందీ, సిన్హాలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేశారు.

ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి వి. రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు. అరుదైన స్వరంతో సంగీత అభిమానుల మదిలో నాటుకుపోయిన ఎస్. జానకి జన్మదినం సందర్భంగా ఆమె పర్సనల్ టచ్ మీ కోసం..

పూర్తి పేరు.. ఎస్. జానకి,
జన్మస్థలం: గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
పుట్టిన తేదీ : ఏప్రిల్ 23, 1938 (1938-04-23)
పాడిన పాటలు: 30వేలకు పైగా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments