" ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే.." అనే "పోకిరి" ఐటం సాంగ్‌లో టాలీవుడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన అందాల సెక్సీడాళ్ ముమైత్ ఖాన్.
పాకిస్తాన్ నుంచి భారత్‌లోని వాణిజ్యకేంద్రం ముంబైలో స్థిరపడిన ముమైత్‌ఖాన్.. ఓ చిన్న డ్యాన్స్ ట్రూప్‌లో పనిచేసేది. నెలకు రూ. 1,500లను జీతంగా పుచ్చుకున్న ముమైత్ నేడు ఐటం గర్ల్‌గా ముద్రవేసుకుంది.
హిందీ, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో సెక్సీతారగా కుర్రకారును మత్తెక్కించిన ముమైత్ ఖాన్‌కు తెలుగు "పోకిరి" ఐటంసాంగ్ మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. తమిళ రీమేక్ "పోకిరి"లోనూ అదే "ఐటంసాంగ్"తో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
తదనంతరం రాజశేఖర్ హీరోగా నటించిన "ఎవడైతే నాకేంటి?" వంటి పలు చిత్రాల్లో ఐటండాళ్‌గా మార్కులు కొట్టేసింది. తర్వాత లేడి ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాధాన్యమిస్తూ పోలీస్ ఆఫీసర్‌గా ముమైత్ ఖాన్ నటించిన "మైసమ్మ", వేణుమాధవ్ సరసన నటించిన భూకైలాష్ సినిమాల ద్వారా హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
టాటూల అందాలతో బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ముమైత్ ఖాన్ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేస్తుంది. అంతేకాదు.. తాను ఎంతో అందగత్తెనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. ఆమె కనుబొమ్మలు, పెదవులు, బొడ్డు వంటి బాహ్య ప్రపంచానికి కనిపించే అందాలన్నీ "సూపర్" అని ఆమే పొగిడేసుకుందట.
బికినీ ధరించేటప్పుడూ టాటూలతో సెక్సీడాళ్‌గా దర్శనమిస్తే ముమైత్‌ను సినీ పండితులందరూ "టాటూ సుందరి" అని ముద్దుగా పిలుచుకుంటున్నారట. ఇప్పటి హీరోయిన్లు టాటూలు వేయించుకోవడంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, అందులో ముమైత్ ఖాన్ మాత్రం ఎప్పుడూ వీపు, ఎదపై టాటూలతోనే కనిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఛత్రపతి, పోకిరి, సామాన్యుడు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఎవడైతే నాకేంటి, యోగి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఆపరేషన్ దుర్యోధన, భూ కైలాష్, సీమ శాస్త్రి, భజంత్రీలు వంటి సినిమాల ద్వారా ఐటంగర్ల్‌గా అందరినీ ఆకట్టుకున్నముమైత్ ఖాన్, మైసమ్మ, మంగతాయారు టిఫిన్ సెంటర్, సవాల్, నేనింతే, పున్నమినాగు, టార్గెట్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది.
తాజాగా చిరుతనయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన మగధీర సినిమాలో "బంగారు కోడిపిట్ట" రీమేక్ సాంగ్‌కు స్టెప్పులు వేసింది.
ఇకపోతే.. ముమైత్ ఖాన్ తల్లి భారతీయ వనిత, తండ్రి పాకిస్తానీ. నలుగురు సోదరీమణులు కలిగిన ముమైత్ ఖాన్‌కు హిందీలో మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్. బిగ్ బ్రదర్ వంటి తదితర సినిమాలు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ముమైత్ ఖాన్ సోదరీమణులలో ఒకరైన "జమైత్ ఖాన్" కూడా సినీరంగ ప్రవేశం చేసింది.
ఇప్పటికే 45 చిత్రాలకు పైగా నటించిన ముమైత్ ఖాన్ ముద్దుపేరు: మున్ను, మున్ని.