Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో పరమార్థం ఏమిటి?(video)

బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు ఉదయం వేంకటేశ్వర స్వామి మోహినీ రూపంలో దంతుల పల్లకిలో తిరుమాడా వీధులలో విహరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహారానికి రాదు కాబట్టి మోహినీ రూపంలోని స్వామి వెంట శ్రీకృష్ణస్వామి మరో పల్లకిపై వచ్చారు. ఉత్సవమూర్తి నిల్

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (18:23 IST)
బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు ఉదయం వేంకటేశ్వర స్వామి మోహినీ రూపంలో దంతుల పల్లకిలో తిరుమాడా వీధులలో విహరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహారానికి రాదు కాబట్టి మోహినీ రూపంలోని స్వామి వెంట శ్రీకృష్ణస్వామి మరో పల్లకిపై వచ్చారు. ఉత్సవమూర్తి నిల్చున్న భంగిమలో కాకుండా దంతపు పల్లకిలో ఆశీనులై కనిపించారు. స్త్రీలు ధరించే అన్ని రకాల ఆభరణాలను స్వామివారికి అలంకరించారు.


వరదభంగిమలో కనిపించే స్వామివారి కుడిహస్తం మోహినీ రూపంలో అభయహస్త ముద్రతో ఉంటుంది. స్వామివారికి పట్టుచీర కీరిటంపైన రత్న, ఖచితమైన సూర్యచంద్ర సావేరి, నాశికకు వజ్రఖచిత ముక్కుపుడక, బులాకి, శుంఖుచక్ర స్థానాల్లో రెండు వికసించిన స్వర్ణకమలాలు ఉన్నాయి.
 
బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలన్నీ వాహనమండపం నుండి తిరుమాఢా వీధుల్లో తిరిగితే... మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. బలగర్వితులు, అహాంకారులు కార్యఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుడిని ఆశ్రయించినవారే ముక్తిసోపనాలను పొందగలరని ఈ వాహనసేవలోని పరమార్థం. 
 
సమస్త జగత్తు తన మాయలోనే ఉందని తనను ఆశ్రయించిన భక్తులు మాత్రమే మాయను జయించి తనను చేకొగలరని మోహినీ రూపంలో స్వామివారు సందేశమిస్తున్నారు. దేవదేవుడకి జరిగే వాహన సేవలన్నిటిలోనూ అలంకరణాలు మారినప్పటికి మోహినీ అవతారంలో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments