Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నశేష వాహనంపై శ్రీవారు... దర్శించిన వారికి యోగసిద్ధి ఫలం(Video)

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం మలయప్పస్వామి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శేషుడు నారాయణాంశ సంభూతుడు. విష్ణువు యొక్క అపరదేహం, ఐదు పడగలు కలిగిన ఈ వాహనంలో రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహం తిరుమలలో కొంతకాలం ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (19:24 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం మలయప్పస్వామి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శేషుడు నారాయణాంశ సంభూతుడు. విష్ణువు యొక్క అపరదేహం, ఐదు పడగలు కలిగిన ఈ వాహనంలో రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహం తిరుమలలో కొంతకాలం ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందుకు గౌరవ సూచికంగా రెండవ రోజు ఉదయం స్వామి వారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని చెబుతుంటారు. 
 
చిన్నశేషవాహనంపై వేంకటేశ్వరుడు మురళీ మనోహారుడు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పెద్దశేషవాహనాన్ని అదిశేషుడిగానూ, చిన్నశేష వాహనాన్ని వాసుకి సర్పంగానూ భక్తులు భావిస్తారు. ప్రతి మనిషిలో ఉండే మనోవైకల్యాలు సర్పాకారంలో వ్యాపించి ఉంటాయి. చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడిని దర్శించి, ధ్యానించడం ద్వారా మనిషిలోని మనోవైకల్యాలు నశిస్తాయి.
 
వ్యక్తిలోని కుండలిని సర్ప రూపపు శిరస్సు, సహస్రాకారంలోనూ పుచ్చం మూలదారంలోనూ నిల్చిననాడు మనిషి నిజంగా మాధవుడికి నిజమైన సేవకుడవుతాడు. చిన్నశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments