Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు

Webdunia
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరు వీధుల్లో కలియతిరిగారు. సప్తగిరీశుడైన శ్రీనివాసుడు గోవర్ధన గిరిధారిగా సప్తాశ్వరథారూఢుడైన సూర్య వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ రంగనాయకుల మండపంలో ఉత్సవర్లు మలయప్పను విశేష సమర్పణతో సర్వాలంకార శోభితుని చేశారు.

వాహన మండపానికి ఊరేగింపుగా వచ్చిన శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. భక్తుల గోవిందనామస్మరణల మధ్య సూర్యప్రభ వాహనసేవ కన్నుల పండుగగా సాగింది. దేవాదాయ శాఖ మంత్రి రత్నాకరరావు, తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ ఛైర్మన్‌ ఆదికేశవులు, ఈవో రమణాచారి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవోలు ప్రభాకర్‌రెడ్డి, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.

బంగారు గొడుగు బహుకరణ
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన మంగళవారం కల్యాణకట్ట నాయీ బ్రాహ్మణుల సంఘం స్వామివారి మహారథానికి బంగారు గొడుగును సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమంలో తొలుతగా కల్యాణకట్టలో బంగారు గొడుగుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వంశపారంపర్యంగా వస్తున్న పంతులుగారి రామనాథం చేతులు మీదుగా బంగారు గొడుగును ఊరేగించారు.

అనంతరం రథంపై అలంకరించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో కేవి.రమణాచారి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు యాదయ్య, అంజయ్య, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఓఎస్‌డి చిన్నంగారి రమణ, బీసీ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments