మధురమైన లడ్డూల తయారీ ఒక కళ. ఆ కళను సొంతం చేసుకున్నది తిరుమలలోని ఒక అయ్యంగార్ల కుటుంబం. అదివారికి వంశపారంపర్యంగా వచ్చిన కళ. స్వామివారికి లడ్డూలు యాంత్రికంగా చేయలేం, ఆధ్యాత్మిక చింతనతో, భక్తిభావంతో చెయ్యాల్సి ఉంటుంది. ఆ భక్తి భావమే తమ కుటుంబాన్ని లడ్డూలతయారీకి అంకితం చేసిందంటారు ఆ కుటుంబ సభ్యులు.