Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభంగా ముగిసిన బ్రహ్మోత్సవాల ధ్వజావరోహణం

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2012 (12:25 IST)
File
FILE
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో పరిసమాప్తమయ్యాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగుతూ శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. అలిసిపోయిన స్వామివారికి తొమ్మిదో రోజు బుధవారం ఉదయం చక్రస్నానం ఘట్టాన్ని వైభంగా నిర్వహించారు.

సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు బుధవారం నిర్వహించిన ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు మలయప్పస్వామి వేణువు చేపట్టి చతుర్మాడ వీధుల్లో ఊరేగారు. అంతకుముందు ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో బలి నివేదన సమర్పించారు.

అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి బంగారు ధ్వజస్తంభం వద్దకు వేంచేశారు. అక్కడ గరుడునికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపఠనం చేశారు. ధ్వజస్తంభం వద్ద ఉన్న గరుడ పటాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా కిందికి దించారు. తర్వాత ఆ పటాన్ని ధ్వజావరోహణానికి వచ్చిన శ్రీనివాసుని పాదల చెంత ఉంచారు.

పిమ్మట ఊరేగింపుగా గరుడాళ్వార్ మండపానికి చేర్చి, బంగారు వాకిలిలో స్వామి వారికి శ్రవణానక్షత్ర ఆస్థానం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి రూ.26.21 కోట్ల ఆదాయం రాగా, సుమారు ఏడు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

Tesla Coming: టెస్లాను ఏపీకి చంద్రబాబు సర్కారు తీసుకువస్తుందా?

ఇతడు పిడుగు కాదు, చిచ్చర పిడుగు, పీక్స్ కెక్కించిన బ్యాండ్ బోయ్(video)

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

Show comments