Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:40 IST)
FILE
కలియుగ వైకుంఠధామం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే ఏడాది నుంచి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీనివాసుడికి ఇకపై ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

టీటీడీ ఛైర్మన్ బాపిరాజు సలహా మేరకు సంవత్సరంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై ఆగమ పండితులతో చర్చిస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు.

ఆగమ పండితుల సూచనల మేరకు రెండుసార్లు బ్రహ్మోత్సవాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన శుక్రవారం విలేకరులతో చెప్పారు. దీనిప్రకారం ఏడాదిలో ఉత్తరాయణం, దక్షిణాయానంలో రెండుసార్లు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

అధిక మాసాలను పురస్కరించుకుని ప్రతి మూడేళ్లకొక సారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ప్రతి ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ యోచిస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

Donald Trump: యూఎస్ఏఐడీ సాయాన్ని 90 రోజులు నిలిపివేస్తాం.. డొనాల్డ్ ట్రంప్

నేనుండగా ఆ మహిళతో అక్రమ సంబంధమా? ప్రశ్నించిన భార్య.. చంపేసిన భర్త!

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

అనగనగా ఉపాధ్యాయుడిగా సుమంత్‌

దిల్ రాజు ఆవిష్కరించిన బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ.. సాంగ్

మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లోనా? చేసే చేతల్లో నా? చెప్పేదే సారంగపాణి జాతకం

Show comments