Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు : వైభవంగా ముగిసిన చక్రస్నానం

Webdunia
అఖిలాండ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజుల పాటు వివిధ సేవల్లో అలసిసొలసిన శ్రీనివాసుడు.. తొమ్మిదో రోజు ఉదయం సేదతీరడం కోసం చక్రస్నాన ఘట్టం నిర్వహించారు.

ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. స్వామి వారికి పుష్కరణిలో చక్రస్నానం నిర్వహించారు. అంతకు ముందు దేవదేవునికి స్నపనతిరుమంజన సేవ నిర్వహించారు. పుష్కరణి గట్టున తిరుమలరాయునికి పంచమృతాభిషేకం నిర్వహించారు.

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీవారి పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేకువజామున 3 గంటలకు స్వామికి పల్లకి సేవ నిర్వహించారు. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

ఈ చక్రస్నాన ఘట్టంలో భాగంగా.. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. తాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments