Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు ధ్వజారోహణం

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:30 IST)
శ్రీవారి బ్రహ్మోత్సావాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణ ఉత్సవం నిర్వహిస్తారు. "న భూతో న భవిష్యతి" అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులనూ ఆహ్వానిస్తారు. స్వామి వాహనం గరుడుడు కాబట్టి, కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని 'గరుడ ధ్వజ పటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు.

ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వాన పత్రం.

ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అరుదైన వేడుక గురువారం సాయంత్రం నిర్వహిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటి.. వర్షాలు ఎప్పటి నుంచి?

పిల్లలు పుట్టిస్తానంటూ మురుగు నీరు తాపించారు.... తాంత్రికుడి క్రూరత్వానికి నిండు ప్రాణం పోయింది...

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

Show comments