Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుల పండువగా సాగిన శ్రీవారి గరుడసేవ

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2011 (10:45 IST)
WD
WD
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి అయిన సోమవారం రాత్రి శ్రీ వేంకటేశ్వరస్వామి గరుడసేవ వాహనంపై ఊరేగి అశేష భక్తజన వాహినికి కనువిందు చేశారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు నిర్వహించే ఈ సేవకు పురాణాలతో పాటు భక్తుల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం తెల్సిందే. ఈ సేవను తిలకించేందుకు లక్షలాదిమంది తిరుమాడ వీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో నిండిపోయారు.

ఈ వాహన సేవలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఆలయ రంగనాయకుల మంటపంలో మలయప్పస్వామికి పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలతో విశేష సమర్పణ కావించారు. అనంతరం కొలువు మంటపానికి ఊరేగింపుగా తీసుకొచ్చి ఊంజల్‌సేవ నిర్వహించారు. తదుపరి ఉత్సవర్లను వాహనమంటపంలో వేంచేపు చేశారు.

ఆ తర్వాత మలయప్ప స్వామిని గరుడవాహనంపై అధిష్టింపజేసి మూలవర్ల ఆభరణాలను అలంకరించారు. ఈ అలంకరణ పూర్తయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన స్వామివారి గరుడ వాహనసేవ తిరుమాడవీధుల్లో సుమారు ఐదు గంటలకుపైగా సాగింది. శ్రీవారి బ్రహ్మరథం ముందుకు సాగుతుండగా వెనుక గోవులు, గుర్రాలు, ఏనుగులు అనుసరించాయి.

శ్రీవారి భక్తుల పండరి భజనలు, కోలాటాలు, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో సప్తగిరులు మర్మోగిపోయాయి. ఈ వాహనసేవలో తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేఈవో శ్రీనివాసరాజు, అధికారులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments