Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 12 నుంచి చెన్నైలో మహా యాగం

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2008 (16:25 IST)
లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి పెద్ద ఎత్తున మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ చెన్నైసమాచార కేంద్రం సలహా సంఘం అధ్యక్షుడు కె. ఆనంద కుమార్ రెడ్డి తెలిపారు. దాదాపు 150 మంది వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెన్నై వాసుల కోరిక మేరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా తిరుమలలో టీటీడీ యాగాలు చేస్తుందన్నారు. మొదటి సారిగా హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది జూలైలో ఈ యాగం జరిగిందన్నారు.

ఆ తరువాత ప్రస్తుతం అక్టోబరు 12,13,14 తేదీలలో చెన్నైలోని తిరువాన్‌మియూర్‌లో చేపడుతున్నట్లు ప్రకటించారు. యాగం 8 ఎకరాల స్థలం జరుగుతుందన్నారు. గతంలో సాయిబాబా అక్కడే యాగం చేశారన్నారు. అది అందరికీ తెలిసిన ప్రదేశం కావడంతో అక్కడే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి తిరుమలలోని వేదవిశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు శ్రీనివాసాచార్యులు సారథ్యం వహిస్తారన్నారు.

రోజులో ఉదయం, సాయంత్రం రెండుసార్లుగా జరిగే యాగానికి భారీ ఎత్తు భక్తులు తరలివస్తున్నట్లు వివరించారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి సెషన్‌లో కనీసం 50 వేల మంది హాజరవుతారని ఆయన అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇక్కట్లు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. టీటీడీ డిప్యూటీ ఈఓ ఎం.గోపాలకృష్ణ మాట్లాడుతూ, దేవస్థానం తరపున భక్తులకు ఉచితంగా మూడు చిన్న లడ్డూ (ప్రసాదం లడ్డూ)లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

Rainfall: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన నివాస ప్రాంతాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

Show comments