Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద నిలయానికి ఏడుసార్లు బంగారు తాపడం!!

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2011 (13:06 IST)
File
FILE
కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటూ, సప్తగిరుల్లో కొలువైవున్న తిరుమల శ్రీనివాసుని నిలయానికి ఆనంద నిలయమనే పేరుంది. ఈ ఆనంద నిలయం బంగారు వర్ణంలో కళ్లు మిరుమిట్లు గొలుపేలా కనిపిస్తూ.. సాక్షాత్తూ స్వామివారినే దర్శించినంత అనుభూతిని కలిగిస్తుంది. దీన్నే విమాన గోపురంగా అని కూడా పిలుస్తారు.

ఈ ఆనంద నిలయానికి ఇప్పటి వరకు ఏడుసార్లు బంగారు తాపడం వేసినట్టు చరిత్ర చెపుతోంది. ఇందులో తొలిసారి విజయనగరరాజు నరసింగదేవరాయలు ఆనంద నిలయానికి బంగారు రేకులు తొడిగించారు.

రెండోసారి సాళువ మాంగి దేవమహారాజు, తర్వాత మల్లన మంత్రి తాపడం చేయించగా, నాలుగోసారి శ్రీకృష్ణదేవరాయలు బంగారు పూత పూయించారు. ఐదోసారి కాంచీపురానికి చెందిన తాతాచార్య, ఆరోసారి హథీరాంజీ మహంతు ప్రయాగ్‌దాస్ నేతృత్వంలో ఈ బంగారు తాపడాలు జరిగాయి.

చివరగా 1958లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా (ఈవో)గా పని చేసిన చెలికాని అన్నారావు 12 వేల తులాల బంగారంతో పూత వేయించారు. దీంతో ఏడుసార్లు ఆనంద నిలయానికి బంగారు తాపడం వేయించినట్టైయింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments