Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్ష్యం

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:25 IST)
" ఏయ్! సాయంకాలం లోపల షర్టు కుట్టి రెడీగా వుంచు" అని టైలర్ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఓ షర్టింగ్ క్లాత్ టైలర్ దగ్గర విసిరేసి వెళ్ళిపోయాడు కౌషల్. కౌషల్ ఎమ్.ఎల్.ఏ గారి ఏకైక కుమారుడు. ఆయన గారిచ్చిన క్లాత్‌ని సాయంకాలం లోపల షర్టు కుట్టక పోతే ఏమవుతుందో టైలర్ సోముకు తెలుసు.

" వెరీ గుడ్! చాలా బ్యూటీఫుల్‌గా కుట్టావు. అన్నట్లు ఈ షర్టుకున్న బటన్స్ ఎంతో అందంగా వున్నాయి." సాయంకాలం షాపు దగ్గరకొచ్చి షర్టు తీసుకుంటూ అభినందించాడు కౌషల్.
" ఈ బటన్స్ కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. తమ లాంటివాళ్ళ షర్టుకు పెడితే బాగుంటుందని పెట్టాను." అని ఎంతో వినయంగా చెప్పాడు సోము.
" గుడ్! కీపిటప్" అని పాకెట్‌లోంచి యాభై నోటు సోముకిచ్చి చిల్లర తీసుకోకుండా వెళ్ళిపోయాడు కౌషల్. పండగ సీజన్ కావడం వల్ల షాపులో ఎక్కువ బట్టలు వున్నాయి. అందుకనే షాపులో పని చేసే కుర్రాడితో-
"' చిన్నా! ఈ రాత్రికి భోజనానికి ఇంటికి రానని మా చెల్లమ్మతో చెప్పరా!" అన్నాడు సోము.
" అలాగే!" అని వెళ్ళాడు చిన్నా.
తెల్లవారేసరికి ...సోమూ రాత్రి మీ చెల్లెమ్మనెవరో వెధవలు మానభంగంచేసి చంపేశారు అన్న పిడుగు లాంటి వార్తను చెప్పారు.
ఓ గావుకేక పెట్టి కుప్పకూలిపోయాడు సోము. తల్లిదండ్రులు లేని చెల్లెల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు సోము.
" మీ చెల్లి చావు మీద మీకెవరిమీదైనా అనుమానం వుందా?" సీ.ఐ సోమును ప్రశ్నించాడు.
చెల్లి కుడిచేతి వైపు చూసిన సోము ముఖంలో ఏదో మార్పు కనిపించింది.
వెంటనే ఈ హత్య ఎవరు చేశారో తెలుసుకున్నాడు.
" చెప్పు నీకెవరి మీదైనా అనుమానం వుందా?" రెట్టించాడు సీ.ఐ.
" లేదు" అని ఎంతో స్థిరంగా చెప్పాడు సోము.
చెల్లెలి అంత్యక్రియలు పూర్తిచేసిన అరగంట తర్వాత ఎమ్.ఎల్.ఏ గారి ఏకైక పుత్రుడు కౌషల్‌ను హత్య చేశాడు సోము.
" ఈ హత్యనువ్వెందుకు చేశావు" స్టేషన్ కొచ్చి లొంగి పోయిన టైలర్ సోమును అడిగాడు సీ.ఐ.
" నా చెల్లెల్ని దారణంగా మానభంగం చేసి చంపింది కౌషలే సార్! అందుకే చంపాను."
" కుమారే నీ చెల్లిని చంపాడని ఎలా చెప్పగలవు?"
" నా చెల్లి చేతిలో వున్న కౌషల్ షర్టు బటనే అందుకు సాక్ష్యం సార్." అని ఎంతో ఆవేశంగా చెప్పి చేతిలోని బటన్ చూపించాడు.
" ఆ విషయం నేనడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు?"
" చెప్తే మీరు అతన్ని అరెస్టు చేస్తారు, తర్వాత అతని తండ్రి పలుకుబడితో విడుదలవుతాడని" సమాధానం చెప్పిన సోము వంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు సీ.ఐ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

Show comments