Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారు

Webdunia
హాల్లో కూర్చుని వీక్లీ తిరగేయసాగింది.
" అమ్మగారూ! అయ్యగారి జేబులో ఈ కాగితం వుందమ్మా!" అంటూ ఓ కాగితంను రాణికిచ్చింది పనిమనిషి.
" ఏంటా ఈ కాగితం?" అని ఆలోచిస్తూ దాన్ని చేతికి తీసుకుని విప్పింది.
భర్త విజయ్ అందమైన చేతిరాత ఎంతో పొందికగా కన్పించింది. అంతే కళ్ళను అక్షరాల వెంట పరిగెత్తించింది.
" సోనీ డియర్! ఎలా వున్నావ్? నిన్ను తలవని రోజే కాదు. క్షణం కూడా లేదు. నా నిండా నువ్వే నువ్వు నా కోసం ఎదురుచూస్తూ వుంటావు కదూ..". ఆపై చదవాలంటే రాణి మనస్సు అంగీకరించలేదు. కళ్ళు కూడా కదలలేదు.
" ఛీ నా భర్త ఇంతటి గ్రంథసాంగుడా సోనీ! నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. విధి లేక ఆఫీసుకు, క్యాంపులకు వెళుతున్నాను అని చెప్పడమంతా నటనా?"
ఈ సోనీ డియర్ ఎవరు? అతని తలపులనిండా ఉన్నప్పుడు నాతో సంసారం ఎందుకు?
ఛీ .ఇటువంటి మనిషితో నేనెంత అన్యోన్యంగా కాపురం చేశాను అని ఎంతో ఏడ్చిన తర్వాత సర్దుకుని ఆ లెటర్ పూర్తిగా చదివిన రాణి
" కాలేజీ రోజుల్లో కూడా ఏ ప్రేమికులూ ఇంత శృంగారంగా ప్రేమలేఖ రాసుకొని వుండరు. ఛీ!".. అనుకుంది.
ఆ తర్వాత కనీసం వంట కూడా చేయలేదు.
విజయ్ ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే నాలుగు మాటలు కసితీరా అడిగేసి పుట్టింటికి వెళ్ళిపోవడమే కాదు విడాకులు తీసుకుని అతని నుండి శాశ్వితంగా విడిపోవాలి అనుకుని ఆలోచిస్తూ వుండిపోయింది.

" రాణి! నీకో గుడ్ న్యూస్ "ఆఫీసునుండి తెచ్చిన ఫైలు టేబుల్ మీద పెడుతూ చెప్పాడు విజయ్.
రాణి ఏంటా గుడ్ న్యూస్ అని అడగలేదు.
' ఛీ సిగ్గులేకుండా మల్లె పూలు పట్టుకొచ్చాడు అనుకుంది.
" రాగీ! స్ట్రాంగ్ కాఫీ పట్రావోయ్!" అన్నాడు. ఆమె కిచెన్‌లోకి వెళ్ళిన వెంటనే వెనకే అతడూ వెళ్ళాడు. కాఫీ కలుపుతున్న ఆమెను వెనుక నుంచి కౌగిలించుకుని తల్లోమల్లెలు తురుముతూ ..
" రాణీ డియర్ ఏంటి అదోలా వున్నావ్? ఎల్లుండి కాంప్ కెళ్తున్నానని కోపమా?" బుగ్గమీద ఒకటిస్తూ అడిగాడు
ఆమె మౌనంగా కాఫీ కప్పు అతడి చేతికిచ్చిందే తప్ప జవాబు చెప్పలేదు.
" ఓహో! నేను గుడ్ న్యూస్ చెప్పలేదని కోపమా ?"
" మీ గుడ్ న్యూస్ నాకేం చెప్పక్కరలేదు. వెళ్ళి మీ సోనీ డియర్‌కు చెప్పండి" కొంచెం విసురుగా చెప్పింది.
" ఏంటోయ్ నువ్వు మాట్లాడేది?" అంటూ ఆమెను కౌగిలించుకోబోయాడు. ఆమె విదిలించుకుని దూరంగా వెళ్ళి-
" తమరు ఇన్ని రోజులు దాచినగుట్టుకాస్తా రట్టయింది" అని ప్రేమలేఖ తీసి చదవసాగింది.
" రాణీ! ఆపాపు! దాన్ని గూర్చే నేను చెప్పాలనుకున్న గుడ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్యూస్" అన్నాడు విజయ్.
ఏంటి అన్నట్లు భర్తవైపు విసురుగా చూసింది. మంచంమీద ఉన్న కొత్త వీక్లీ తెరిచి-
" ఈ పేజీ చదువు" అని ఆమెకు చూపాడు. తన చేతిలో వున్న ప్రేమలేఖ మేటర్ వీక్లీలో ప్రింటయి వుండడం గమనించింది. అంతేకాకుండా మొదటి బహుమతి వెయ్యి రూపాయలు గెల్చుకున్న ప్రేమలేఖ అని కూడా వుంది.
" రాణీ! నీ చేతిలో వుంది ప్రేమలేఖ రఫ్ కాపీ . వెయ్యి రూపాయలు మొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతి డబ్బు నీ చీరకోసం శాంక్షన్ చేశానే మొద్దూ! అదే గుడ్ న్యూస్" అన్నాడు.
" సారీ" అంటూ భర్త కౌగిట్లో గువ్వగా ఒదిగిపోయింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

Show comments