Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడమీది గది

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (20:18 IST)
శంకరయ్య గారి మేడమీది గదిలో రవి, రాకీలు అద్దెకుంటున్నారు. శంకరయ్యగారి ఏకైక కూతురు క్రాంతి. చాలా అందగత్తె. రవి, రాకీలు ఇద్దరూ ఆ అమ్మాయిని తెగ ప్రేమించేస్తున్నారు. రవి ఒక్కడే రూంలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన మధు... "రవీ! ఏంట్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?" అంటూ ప్రశ్నించాడు.

" ఏం లేదురా మధు! నా హృదయరాణి క్రాంతి లేకపోతే నేను బ్రతకడం చాలా కష్టంరా" అంటూ సినిమా స్టైల్లో చెప్పాడు. అప్పుడే రూంలోకి వస్తున్న రాకీ.. రవి మాటలు విని - "ఒరేయ్ యిడియట్! క్రాంతి నీ హృదయరాణా? అసలు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడావా? అసలు క్రాంతంటే ఎవరనుకున్నావ్? ఈ రాకీకు కాబోయే భార్య" అంటూ గుండె మీద ఓసారి చేయించుకుని, "రాత్రింబవళ్ళూ ఆమె కోసమే తపిస్తూ నిద్ర పోకుండా డైరీలు మీద డైరీలు నింపేస్తున్నది,, పిచ్చి గీతలనుకున్నావా అవన్నీ నా క్రాంతి నాలో రేపిన అపురూప భావాలు "- అంటూ రాకీ తన తరపున ప్రేమను నాటకీయ పక్కీలో వ్యక్తంచేశాడు.

" అబ్బో! నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నట్లు, ఏదో మంచినీళ్లకు, వీక్లీలకు వెళ్ళి అడగడమేగా, ఎప్పుడన్నా అరగంట ప్రేమ కబుర్లు మాట్లాడావా?" కవ్వింపుగా అన్నాడు రవి. "నేను ప్రేమ కబుర్లు చెప్పినా, చెప్పకున్నా ఆమె నాకెప్పుడో మనసిచ్చేసింది. నా హృదయం నిండా ఆమే వుంది "ఆవేశంగా అన్నాడు రాకీ. "ఆమె నన్ను ప్రేమిస్తోంది".

" కాదు, నన్ను" యిలా రవీ, రాకీ లిద్దరూ వాదించుకుంటుంటే విసుగెత్తిన మధు, "ఒరేయ్ బాబూ! ఆపండ్రా మీ గోల. మీ రూంకి రావాలంటేనే భయమేస్తుంది నాకు. అయినా విధి లేక వస్తున్నాను" అన్నాడు విసుగ్గా. అప్పుడే రూంలోకి అడుగు పెట్టిన శంకరయ్య... "బాబూ రవీ, రాకీ .!.ఈ నెలాఖరుకి రూం ఖాళీ చేసేయండి. ఆ తర్వాత రూంతో మాకు అవసరం వుంది" అన్నాడు మెల్లగా.

" అయ్య బాబోయ్! కొంపదీసి మేం క్రాంతిని ప్రేమిస్తున్న విషయం ఈయనగానీ గమనించాడా!" అని రవి, రాకీలిద్దరూ ఒకేసారి భయపడ్డారు మనస్సులో ...అయినా మాటల్ని కూడదీసుకుని... "మేం ప్రతి నెలా రూం రెంట్ సక్రమంగానే చెల్లిస్తున్నాం కదండీ!" అన్నారిద్దరూ మెల్లగా. "రెంట్ కోసం కాదు బాబూ! పై నెల క్రాంతి పెళ్ళి.

పెళ్ళయిన తర్వాత అల్లుడుగారు యింటికి వచ్చినపుడు ప్రత్యేకంగా వుండడానికి గది కావాలి కదా! ఏం బాబూ మధు, నీకు సపరేట్ గది అక్కరలేకపోతే వీళ్ళను వుండమంటాను "అన్నాడు మధు వైపు తిరిగి. "అంటే?" అంటూ రాకీ, రవిలిద్దరూ ఒకేసారి శంకరయ్యను ప్రశ్నించారు. "అంటే ఏముంది బాబూ! ఈ మధు నా కాబోయే అల్లుడు "అన్నాడు శంకరయ్య. నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు రవి, రాకీలు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

Show comments