Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది...

Webdunia
WD
" పూజ్యులైన తండ్రిగార్కి, మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది. మేము యిచ్చట క్షేమం. మీ ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. మీరు అనుమతించిన యెడల మిమ్మల్ని పెద్ద హాస్పిటల్‌లో చూపించేందుకు మీ అల్లుడు సిద్దంగా వున్నారు. మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను. మీ కుమార్తె లత" ఉత్తరాన్ని పూర్తిగా చదివిన మాధవయ్య ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు.

" మాధవా! యింకా పట్టింపులు ఎందుకురా... ! హాయిగా వెళ్ళి నీ కూతురు దగ్గర వుండవచ్చు కదరా! నువ్విదే పరిస్థితిలోవుంటే రోజురోజుకీ అనారోగ్యంతో క్షీణించడమే తప్ప మరేమీ వుండదు. వెంటనే నువ్వు లతకు లెటర్ రాయి. నీ అల్లుడు కూడా చాలా మంచివాడు" అన్నాడు స్నేహితుడు రామ్మూర్తి.

" ఏనాడైతే నా నిర్ణయాన్ని కాదని వేరేవాడిని పెళ్ళి చేసుకుందో ఆనాడే దానికీ నాకూ వున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఇక నేను వాళ్ళతో కలిసే ప్రసక్తే లేదు" స్థిరంగా చెప్పాడు మాధవయ్య.

" మాధవా! ఒక్కసారి నువ్వు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించు. ఆ రోజుల్లో నువ్వు మీ తల్లిదండ్రుల్ని కట్నాన్ని కాదని నిన్ను నమ్ముకున్న సీతను ఆదర్శంగా వివాహం చేసుకున్నావు. చనిపోయేంతవరకూ సీత తల్లిదండ్రులు కాని మీ తల్లిదండ్రులు కానీ మీతో కలవలేదు. అయినా మీరు ఎంతో అన్యోన్యంగా వున్నారు. మీకు పుట్టిన లతను అల్లారుముద్దుగా పెంచారు. కానీ లత దురదృష్టం పదేళ్ళకే తల్లిని పోగొట్టుకోవలసి వచ్చింది. అయినా దాన్ని ఆ లోటు తెలియకుండా పెంచావు."

" అలా పెంచాను కాబట్టేరా ఈ బాధ" మధ్యలో అందుకుని చెప్పాడు మాధవయ్య.
" బాధ ఎందుకురా? దానికి యిష్టమైన వాణ్ణి చేసుకుంది . అది దాని యిష్టం."
" నా యిష్టాయిష్టాలతో పనిలేదంటావా ?"
" మాధవా! నువ్వు ఒకప్పటి మీ తల్లిదండ్రుల్లానే ఆలోచిస్తున్నావా?" కొంచెం కోపంగా ప్రశ్నించాడు రామ్మూర్తి.

" ఎందుకు ఆలోచించకూడదు ప్రస్తుతం నేనూ ఓ తండ్రినేగా" మూర్ఖంగా అన్నాడు.
" మాధవా! చీకటిలోనే వుండాలని ప్రయత్నించకు ఒక్కసారి వెలుగులోకి రా" అన్నాడు.
" నన్ను కాదన్న లత నా కూతురు కానేకాదు . కనీసం నా శవాన్ని చూసే అర్హత కూడా దానికి లేదు" కోపంగా అన్నాడు మాధవయ్య.
" తరం మారింది. తండ్రిగా నువ్వూ మారావ్ అంతే" అనుకుంటూ వెళ్ళిపోయాడు రామ్మూర్తి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

Show comments