Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్పు కోసం

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:26 IST)
సుబ్బయ్య రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి అచ్చిరాలేదో లేక కష్టపడి పని చేయలేదో గానీ
అన్నీ నష్టాలే వచ్చాయ్.
" దాదాపు నలభై అయిదేళ్ళు నిండుతున్నాయ్. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ నేను నిలదొక్కుకోలేకపోయానే!" అని ఆలోచిస్తున్న సుబ్బయ్య దగ్గరకు ఆయన భార్య అమలమ్మ వచ్చి,-
" ఏమండీ! మీరు పని మీద ఉదయం బయటకు వెళ్ళినప్పుడు మా పెద్దన్నయ్య వచ్చి వెళ్ళాడండీ. మా పెద్దన్నయ్య స్నేహితుడెవరో కలంకారీ దుప్పట్లు తయారుచేస్తున్నాడట. మనకు కావాలంటే ఎన్నయినా అప్పుగా యిస్తారు. బావగారిని వెళ్ళి తెచ్చుకుని దుప్పట్ల వ్యాపారం చెయ్యమను" అని వాళ్ళ స్నేహితుడికి రాసిచ్చిన లెటరును భర్త చేతిలో పెట్టింది అమలమ్మ.
" అన్ని వ్యాపారాలూ చేశాను. ఈ దుప్పట్ల వ్యాపారం కూడా చూస్తాను" అని భార్యతో చెప్పి ఇల్లు వదిలాడు సుబ్బయ్య.

సుబ్బయ్య ఊహించినంత గొప్పగా అమ్ముడుపోసాగాయి కలంకారీ దుప్పట్లు. వెంటనే అతడి మదిలో "నేనే దుప్పట్లు తయారు చేసే వ్యాపారం కూడా ప్రారంభిస్తే?" అన్న ఆలోచన రావడం నెలరోజుల్లో అతడి ఆలోచన కార్యరూపం దాల్చడం జరిగి పోయింది.
కలంకారీ దుప్పట్ల మీద పెయింటింగుల్తో బొమ్మలు వేసేందుకు రవి అనే మంచి ఆర్టిస్టు దొరికాడు సుబ్బయ్యకు.
ఓ రోజు సుబ్బయ్య మదిలో ఓ విషపు ఆలోచనకు అంకురార్పణ జరిగింది- వెంటనే ఆర్టిస్టు రవిని పిలిచి -
" చూడు రవి! మంచి మంచి అందగత్తెల బొమ్మల్ని బర్త్‌డే సూట్‌లో వున్నట్లు మన దుప్పట్ల మీద వేసేటట్లు చూడు" అన్నాడు.
రెండురోజుల్లో రవి సుబ్బయ్య ఐడియాను కార్యరూపంలోకి తెచ్చాడు. నగ్న సుందరి బొమ్మతో వున్న దుప్పటిని తనివితీరా పైనేసుకుని -'దీన్ని మార్కెట్‌లో ఎలా దొంగతనంగా అమ్మాలా' అని ఆలోచించాడు.
పది రోజుల్లో దొంగతనంగా ఆ బర్త్‌డే సూట్ బొమ్మలున్న దుప్పట్లు మార్కెట్‌లో ప్రవేశించాయి. ఫలితం నెలల్లో సుబ్బయ్య లక్షలకు అధిపతి అయ్యాడు.
ఓ రోజు బెడ్‌రూంలో వున్న సుబ్బయ్య దగ్గరకు హడావిడిగా వచ్చిన భార్య అమలమ్మ -
" ఏమండీ! మనకున్న ఒక్కగానొక్క అమ్మాయి మీ ఆర్టిస్టు రవితో లేచిపోయిందండీ" అన్న బాంబు లాంటి మాటల్ని భర్త దగ్గర పేల్చింది.
" ఆఁ!" అని చిన్న కేక వేశాడు సుబ్బయ్య.
" ఆ వెధవ రవిగాడు ఓ రోజు తను దుప్పటి మీద ఓ మంచి బొమ్మ ... అదే మీరు మార్కెట్‌లో దొంగతనంగా అమ్ముతున్న దుప్పట్ల మీది బొమ్మ లాంటిది వేసి మన వినీతకు ప్రెజంట్ చేశాడట. ఆ రోజు నుంచీ వాళ్ళిద్దరి మధ్యా..".
అంటూ చెప్పబోతున్న భార్య మాటల్ని కట్ చేస్తూ -
" ఆపు. యింకేం చెప్పకు. ఆ వెధవ వ్యాపారం మన కూతుర్నే కాకుండా యింకెందర్నో యిలా చేసి ఉంటుందేమో?" అని తల పట్టుకున్నాడు జ్ఞానోదయమైన బోయవాడిలా.
" నిజంగా మీరు చేసేది వెధవ వ్యాపారమే అయితే మానేయ వచ్చుగా?" అంది అమలమ్మ.
" మానేస్తాను అమలా!" అని స్థిరంగా చెప్పాడు.
" హమ్మయ్య! చూడండి మన వినీత ఎక్కడికీ వెళ్ళలేదు. హాయిగా బెడ్‌రూంలో నిద్ర పోతోంది. కేవలం మీరు ఓ తప్పు చేస్తున్నారనీ, మిమ్మల్ని మార్చాలని పెద్ద అబద్దం ఆడాను. క్షమించండీ! అంది అమలమ్మ.
కళ్ళు తెరిపించిన భార్య వైపు తృప్తిగా చూశాడు సుబ్బయ్య.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

Show comments