Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్పులు

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:29 IST)
క్లాసు రూంలో లాస్ట్ పీరియడ్ పాఠం చెప్తున్న టీచర్ వెంకట్ వద్దకు ప్యూన్ వచ్చి... "మీ స్నేహితుడు ఎవరో విజయవాడ నుంచి వచ్చాడట అర్జంటుగా మిమ్మల్ని కలవాలంటున్నాడు" అంటూ చెప్పేసరికి ...
" ఇప్పటి వరకూ మీకు సప్తవ్యసనాలంటే ఏమిటో చెప్పాను... ఆ సప్తవ్యసనాలలో అతి నీచమైనది తాగుడని కూడా చెప్పాను. తాగుడు ఎలా నీచమైందో మీరు సోమవారం క్లాసుకి వచ్చేటప్పుడు ఓ పది లైన్లు మించకుండా వ్యాసం రాసి తీసుకురండి. ఇక వెళ్ళండి" అంటూ విద్యార్ధులనుద్దేశించి చెప్పి తను రెస్ట్ రూం వైపు వెళ్ళిపోయాడు టీచర్ వెంకట్.
రెస్ట్ రూంలోకి అడుగు పెడుతున్న వెంకట్‌ను చూసిన మిత్రుడు పృధ్వి ఆనందంతో .."దాదాపు సంవత్సరమైంది రా నిన్ను చూసి" అన్నాడు.
" అది సరే గానీ ఇంత సడెన్‌గా వూడిపడ్డావేమిటి" ప్రశ్నించాడు వెంకట్.
ఓ అరగంట సంభాషించుకుని స్కూల్ ఆవరణ నుండి బయటపడ్డారిద్దరూ... నడుస్తున్న పృధ్వి కంటికి ఓ బ్రాందీ షాపు కన్పించేసరికి ..
" మనం కలిసి తాగి చాలా రోజులైంది ఓ పెగ్గు వేసుకుని రూంకి వెళ్దామా?" అన్నాడు వెంకట్‌తో.
" నేను తాగడం మానేశారా" అన్నాడు వెంకట్.
" ఈ ఒక్కరోజు తాగు మళ్ళీ మానేద్దువు కమాన్" అంటూ పృధ్వి బలవంతం చేసేసరికి చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారేమోనని పిల్లిలా చూస్తూ బ్రాందీ షాపులోకి దూరాడు వెంకట్.
ఓ గంట తర్వాత బ్రాందీ షాపులోంచి బయటకు వచ్చేటప్పుడు గర్వంగా తలెత్తుకుని పులిలా బయట పడ్డాడు. అప్పుడు "అంతరాత్మ ఎవరైనా చూస్తారేమో!" అని హెచ్చరిస్తోంది.
" ఎవరు చూస్తే ఏం వాళ్ళు డబ్బిచ్చారా?" అంటూ అంతరాత్మను ఎదురు ప్రశ్నించాడు వెంకట్. పృధ్వితో కలిసి అతనుంటున్న హోటల్‌కెళ్ళి అక్కడ మళ్ళీ మందు తెప్పించుకొని తాగి తిన్నాడు వెంకట్. కండిషన్ కొద్దిగా తప్పింది వెంకట్‌కి.. అందుకని మిత్రుడు పృధ్వి,
" ఈ రాత్రికి ఇక్కడే వుండిపోరాదూ?" అన్నాడు.
" లేదు నేను వెళ్ళాలి" అంటూ బయటపడి ఇంటి వైపు నడుస్తున్న వెంకట్ కాళ్ళు పొరపాటున సైడు కాలవ వైపు కదిలేసరికి ...అందులో పడి పైకి లేవలేకపోయాడు.
వళ్ళంతా బురదతో నల్లగా తయారైంది...

సోమవారం క్లాసులోని స్టూడెంట్స్ యిచ్చిన వ్యాసరచన కాగితాల్ని రాత్రి యింటివద్ద చూస్తున్న వెంకట్‌కి ..ఓ స్టూడెంట్ రాసిన కాగితం తెరిస్తే .ఒకే ఒక్క లైను కనిపించేసరికి ఆశ్చర్యపోయి దాన్ని చదివాడు.
" తాగక ముందు పిల్లిలా..తాగిన తర్వాత పులిలా.. ఆ తర్వాత పందిలా మారతాడు. కాబట్టే తాగుడు నీచాతినీచమైనది" అని రాసివున్న అక్షరాలు చదివేసరికి వెంకట్ మనస్సులో ఏదో తెలియని బరువు పడ్డట్టు అన్పించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

Show comments