Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పేదింటి పిల్లను కాను...

Webdunia
WD
" అమర్... నీతో నేను ఇలా చనువుగా తిరుగుతున్న విషయం మా వాళ్ళెవరో తెలుసుకుని మా నాన్నగారితో చెప్పినట్లున్నారు. మా నాన్నగారు ఫోన్లో నాకు చివాట్లు పెట్టారు. నువ్వు మీ తల్లిదండ్రులతో మాట్లాడి తొందరలో ముహూర్తాలు పెట్టించే ఏర్పాటు చూడు" అని చెప్పిన సుమిత్ర మాటల్ని విన్నాడో లేదో కాని సిగరెట్ మీద సిగరెట్ కాల్చేస్తూ తెగ ఆలోచించేస్తున్నాడు అమర్.

పెద్ద చదువుల నిమిత్తం సిటీకొచ్చి చదువుతున్న సుమిత్రకు ఇంటర్ యూనివర్శిటీ చెస్ పోటీలలో చెస్ ఛాంపియన్‌గా పరిచయమయ్యాడు అమర్. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అమర్ ఎంత చొరవ తీసుకున్నా అతన్నుంచాల్సిన హద్దుల్లో వుంచింది సుమిత్ర.

గొప్ప చదరంగపు ఆటగాడైన అమర్ జీవన చదరంగంలో సుమిత్రతో ఈ పెళ్ళి అనే అడ్డంకిని ఏవిధంగా తొలగించుకోవాలి? ఏ ఎత్తు వెయ్యాలి? ఎలా? ఎలా? ఎలా? అని నానారకాలుగా ఆలోచించసాగాడు. అతని ఆలోచనల్ని భంగపరుస్తూ...

అమర్ నేను నిన్ను ప్రశ్నించిన విషయమై నీకు చీమకుట్టినట్టయినా లేనట్టుంది. అవునులే ఎందుకుంటుంది? ఎంతైనా మగవాడివికదా? నిష్ఠూరం ధ్వనించిందామె గొంతులో. '' అబ్బే.. లేదు సుమ ి| .. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానంతే" తడబడుతూ చెప్పాడు.

" ఏంచెయ్యాలనుకుంటున్నావో నాతో చెప్పవచ్చుకదా?" ప్రస్తుతానికి నాకైతే ఏమీ అర్థంకావడం లేదు... కమాన్ వెళ్ళి మంచి ఐస్‌క్రీం తినొద్దాం అన్నాడు.

అలా ఆ రోజు ఐస్ క్రీమ్ ఇప్పించిన అమర్... ఆ తర్వాత కనిపించలేదు. అతని జాడ లేకుండా పోయింది. కాల చక్రం వేగంగా తిరిగింది... సుమిత్ర కంటికి అమర్ మాత్రం కనిపించలేదు. ఒకరోజు నెహ్రూపార్కులో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తున్న సుమిత్ర చెవులకు బాగా పరిచయమున్న గొంతు వినిపించేసరికి ఆ గొంతును ఆలకించసాగింది.

" దేవి అనవసరంగా గొడవ చెయ్యొద్దు. అసలు నిన్ను నేను ప్రేమించాననడానికి ఆధారం ఏమైనా వుందా? వుండదు కాబట్టి నోరు మూసుకుని నేను చెప్పినట్లు నడుచుకో"
" నువ్వు చెప్పినట్లు నడుచుకోబట్టే యిప్పుడు ఒక బిడ్డకు తల్లివి కాబోతున్నాను" ఆడగొంతు.
" నా వల్లే తల్లివి కాబోతున్నావన్న గ్యారంటీ వుందా? అసలు నువ్వు నాతో తిరిగిందానికి ఆధారాలున్నాయా?"
" ఛీ నువ్వింత మోసగాడివనుకోలేదు... ఇప్పుడు అనుకుంటున్నావుగా... వస్తాను గుడ్ బై..." అంటూ వెళ్ళిపోయాడతను.
ఆ కంఠం తన మాజీ ప్రియుడు అమర్‌దే.

మౌనంగా రోదిస్తున్న దేవి దగ్గరకు వెళ్ళింది సుమిత్ర. "చూడమ్మా ఆడది ఎప్పుడూ తన జాగ్రత్తలో తను ఉండాలి. అలా లేకపోతే ఈ మేకవన్నె పులులు దాడిచేసి ఆడదాని జీవితాలను నాశనం చేస్తాయి" అని ఆవేశంగా మాట్లాడుతున్న సుమిత్రను చూసి .. "మీరు.." అంటూ మధ్యలో ప్రశ్నించింది దేవి.

నేనెవరైతే ఎందుకుకానీ ప్రస్తుతానికి అమర్‌తో తిరిగినట్టు సాక్ష్యం నీకు కావాలి. కాబట్టి ప్రస్తుతం మీరిద్దరూ కూర్చున్నప్పుడు నేను తీసిన ఫోటో డెవలప్ చేయించి యిస్తాను. ఆ ఆధారం అతనికి చూపించు...

అంతే కాదు. నాకు తెలిసిన డాక్టర్ ద్వారా నీకు పుట్టే బిడ్డకు తండ్రి అమర్ అని శాస్త్రపరంగా రుజువుచేసి కోర్టుకీడుస్తాను అని చెప్పు. అప్పటికీ పెళ్ళికి అంగీకరించకపోతే చట్టపరంగా అతనిచేత నీ మెళ్ళో మూడుముళ్ళు వేయించే బాధ్యత నాది అంటూ ధైర్యం చెప్పింది సుమిత్ర. దేవి కంటికి సుమిత్ర ఒక దేవతలా కన్పించసాగింది.

" హాల్లో సుమిత్రగారూ. పై నెల పదో తేదిన నా పెళ్ళి... మొదటి యిన్విటేషన్ మీకే యివ్వాలని వచ్చాను. అంటూ వెడ్డింగ్ కార్డిచ్చింది దేవి. వెడ్డింగ్ కార్డు చేతికి తీసుకొని చూస్తున్న సుమిత్రను... తప్పకుండా వస్తారు కదూ? అని దేవి ప్రశ్నించేసరికి... తప్పక వస్తాను అంది సుమిత్ర..

పెళ్ళి హడావిడి తగ్గి చదివింపులు కార్యక్రమం వచ్చేసరికి... అమర్ పేరుతో ఒక చిన్న గిఫ్ట్ ప్యాకెట్ చదివిస్తున్న సుమిత్రను చూసిన అమర్ తలవంచుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ తెరచిచూస్తే అందులో ఒక చిన్న కాగితం కన్పించింది. ఆత్రంగా మడత విప్పాడు.

మిస్టర్ అమర్... నువ్వు నన్ను ప్రేమించి మోసం చేశావు. అయితే దేవిని తల్లినిచేసి మరీ మోసం చెయ్యాలని చూశావు. కానీ చెయ్యలేకపోయావు. నన్ను నువ్వు మోసం చేశాననుకుంటున్నావు కదూ?

కాదు... నువ్వే మోసగించబడ్డావు. నీతో చెప్పినట్లుగా నేనేమీ పేదింటి పిల్లను కాదు. గొప్ప ధనవంతురాలి ఏకైక కుమార్తెను. గుడ్‌బై... నెక్స్‌ట్ వీక్ అమెరికా వెళ్తున్నాను... అక్కడే నా పెళ్ళి. వుంటాను. ఆపై ఆమె పేరు చదువుదామన్నా అమర్ కంటికి అక్షరాలు సరిగా కన్పించడం మానేసాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

Show comments