Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ అంతు చూసేందుకే పెళ్లి చేసుకున్నా...

Webdunia
WD
ఏంటే మొద్దూ... ఏదో ఆలోచిస్తూ వున్నావ్? నా ఆలోచనల్ని చెదరగొడుతూ ప్రశ్నిచింది సుమ. నేనేం జవాబు చెప్పలేదు.
ఏయ్ నిన్నే అడిగేది... కొంచెం గట్టిగా అడిగింది.
ఏం లేదే... అన్నాను నేను.

ఆహా ఏమీ లేకపోవడమేమిటి? ఇంకొద్ది సేపట్లో శోభనం గదిలోకి వెళ్ళబోతున్నావు కదా దాని గురించే ఆలోచిస్తూ వుండి వుంటావు కొంటెగా మాట్లాడింది సుమ. ప్రక్కనున్న మిగిలిన స్నేహితురాళ్ళు కూడా సుమ మాటలకు నవ్వి నన్ను కవ్వించసాగారు.

నిజంగా నా ఆలోచనలు మాత్రం శోభనం మీదలేనే లేవు. ఈ విషయం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకనే చెప్పలేదు.
కొద్ది సేపటికి తెల్లచీర, మల్లెపూలతో అలంకరించారు నన్ను. చేతికి పాలగ్లాసు ఇచ్చి పడగ్గది తలుపువరకు సాగనంపారు స్నేహితురాళ్ళు మరియు బంధువులు.

గదిలోకి అడుగుపెట్టిన నా మనసంత అదోలా తయారైంది. జీవితంలో ఒకే ఒక్కసారి తప్ప ఎప్పుడూ రానిరోజిది. కానీ లోపల నా కోసం ఎదురు చూస్తున్న అతనికో? అని ప్రశ్నించుకున్నాను. అతనికిది రెండోసారి... అని జవాబిచ్చింది అంతరాత్మ.

నిజమే అతనికి నాతో రెండవ వివాహం. తెలిసే చేసుకున్నాను. ఇందులో నా తల్లిదండ్రుల బలవంతం ఏమీ లేదు. అంతా నా యిష్ట ప్రకారమే జరిగింది.

రెండునెలల క్రితం...
రాఘవయ్యగారూ, మంచి సంబంధం ఉంటే చెప్పమని ఎప్పటినుంచో అడుగుతున్నారుగా. ఇదిగో... అబ్బాయి గుణవంతుడు, మంచి ఉద్యోగం... అంటూ శాస్త్రుల వారు యింట్లోకి ప్రవేశించాడు.

కట్నం ఏ మాత్రం అడుగుతున్నారు? ఆడపిల్ల తండ్రి వేయాల్సిన సర్వసాధారణ ప్రశ్న మా నాన్న కూడా వేశారు. కాణీ కట్నం కూడా వద్దంటున్నాడు అన్నాడు శాస్త్రులు.

ఏం ఎందుకని అబ్బాయికీ ఏమన్నా లోపమా? ప్రశ్నించాడు నాన్న
ఏ లోపమూ లేదు. చక్కని పర్సనాలిటీ. కాకపోతే పెళ్ళయిన రెండేళ్ళకే భార్య చనిపోయింది.

చాల్లేవయ్యా... రెండో పెళ్ళి సంబంధం, మంచి సంబంధమా... శాస్త్రుల్ని మాట్లాడనివ్వకుండా మధ్యలో అందుకుని కోపంగా చెప్పేశాడు నాన్న. దాంతో వెళ్ళిపోయాడు శాస్త్రులు.

శాస్త్రులుగారు మంచి ఉద్యోగం, మంచి అబ్బాయి అంటున్నారు. మీరేమో వద్దంటున్నారు అని మెల్లగా నాన్న దగ్గర మాట్లాడింది అమ్మ. రెండో పెళ్ళివాడ్ని నా కూతురికి కట్టబెట్టాల్సిన ఖర్మ నాకు లేదు అన్నారు నాన్న. సంబంధం మంచిదైనప్పుడు ఎందుకు వదులుకోవాలి. అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది కదా... అంది అమ్మ.

నిజంగా నాకూ రెండో పెళ్ళి వ్యక్తి అంటే అదోలా బాధపడింది మనస్సు. రెండు రోజుల తర్వాత అబ్బాయి వివరాలన్నీ శాస్త్రులగారి దగ్గర తీసుకొచ్చి అమ్మదగ్గర యిచ్చాడు. ఆమె నా దగ్గర ఇచ్చింది.

అతని వివరాలన్నీ పూర్తిగా చూసి ఒక రోజంతా ఆలోచనలో పడ్డాను. ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నాను.
అంతే- సుజాతా ఏంటి ఆలోచిస్తూ గుమ్మం దగ్గరే నిల్చుండి పోయావు? అన్న మాటలు విన్పించి ఉలిక్కిపడి గతంలోంచి బయటకు వచ్చాను.

ఎదురుగా మల్లెపూవుకన్నా తెల్లటి సిల్కు జుబ్బాలో నిత్యనూతన పెళ్ళి కొడుకులా వున్నాడతడు.
రా... వెళ్ళి కూర్చుందాం అని మంచం వరకూ తీసుకెళ్ళాడు.

సుజాతా ఏదైనా వుంటే ఈ రోజే మనసు విప్పి మాట్లాడుకుందాం. నాకు ఇదివరకే పెళ్ళయి భార్య చనిపోయింది. ఒక బాబు కూడా వున్నాడు.
తెలుసు ముక్తసరిగా చెప్పాను నేను.
తెలిసి కూడా ఈ పెళ్ళి ఒప్పుకున్నందుకు థాంక్స్. నా బిడ్డని మన బిడ్డగా చూసుకుంటావు కదూ?
అలా చూసుకోవడం కోసమే నేను ఈ పెళ్ళకి ఒప్పుకుంది. నాకు తెలియకుండానే నా నోట్లో నుంచి కొంచం గట్టిగా వచ్చాయా మాటలు.

అంటే...? కొంచెం ఆశ్చర్యంగా ప్రశ్నించాడు
నీ గత జీవితమంతా నాకు బాగా తెలుసు కొంచం వ్యంగ్యంగా మాట్లాడాను.
నువ్వు మాట్లాడేది దేని గురించో నాకు అర్థం కావడం లేదు- అతడి మాటల్లో తడబాటు కన్పించింది.

నీ మొదటి భార్య వనజ నా ప్రాణ స్నేహితురాలు. ఆమెను నువ్వే కిరోసిన్ పోసి తగులబెట్టి చంపావని తెలుసు. నా మాటలు అతనిలో ఎంత తత్తరపాటు కలిగించాయో అప్పుడ అతడ్ని చూస్తేకానీ తెలియదు.

సుజాతా అదంతా అబద్దం- తడబడుతూ చెప్పాడతడు.
నో నిజం. అది పచ్చి నిజం. వనజను కిరోసిన్ పోసి కాల్చి చంపిన కిరాతకుడివి నువ్వే. అందుకే నీ అంతం చూడాలని వచ్చాను. కానీ నా వనజ బిడ్డను మాత్రం నా బిడ్డగా చూసుకుంటాను అని వెలుగుతున్న లైట్ ఆర్పివేశాను.
గదంతా చీకట్లు వ్యాపించాయి.

పాపం పెళ్ళయిన రోజే భర్తను కోల్పోయింది సుమ...
ఎంత దురదృష్టవంతురాలో...
ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరూ నా మీద సానుభూతి చూపించసాగారు.

నిజమే పెళ్ళయిన రాత్రే భర్త చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో నాకే తెలుసు నాలో నేనే అనుకున్నాను.
నా నిర్ణయం సరైందో కాదో నాకు తెలియదు కానీ నా స్నేహితురాలు వనజ బిడ్డ నా చేతుల్లో నవ్వుతూ వుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

Show comments