Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీ నీకు జోహార్లు !

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:32 IST)
" రమేష్! ఈరోజు నీకో సెన్సేషనల్ న్యూస్ మాటర్ ఇస్తాను. దాన్ని నువ్వు బాక్స్ ఐటమ్‌గా తెల్లారేసరికి పేపర్లో వచ్చేటట్లు చూడాలి. అందుకే నిన్ను అర్జంటుగా పిలిపించింది." అన్నాడు ప్రతిపక్ష నాయకుడు సుందరయ్య. ‌"అలాగే సార్! ఇంతకీ ఏమిటా సెన్సేషనల్ న్యూస్?" ప్రశ్నించాడు రమేష్.

" ప్రస్తుత మన సాంఘిక సంక్షేమ శాఖామంత్రి భానుమతి ఒకప్పటి గొప్ప క్యాబరే డాన్సర్ . డాన్సర్ గా ఆమె సంపాదించిన లక్షలాది రూపాయల్ని చిల్లపెంకుల్లా వెదజల్లి ఎమ్మెల్యేగా గెలిచి తన అందచందాలు ఎరగా చూపి మంత్రిణి అయ్యింది" అని రమేష్ చేతికి కొన్ని కలర్ ఫోటోలు ఇచ్చాడు సుందరయ్య.

భానుమతి అర్ధనగ్నంగా డాన్సు వేస్తున్న వివిధ భంగిమల్లో వున్న ఫోటోలు చూస్తున్న రమేష్‌తో "నువ్వు రాసే ఆర్టికల్‌తో పాటు ఈ ఫోటోలు కూడా ప్రచురితమైతే చాలు ఆమె రాజకీయ జీవితం క్లోజ్. నువ్వెలా చేస్తావో నీ యిష్టం" అని పైకి లేచాడు సుందరయ్య. ఇక మాట్లాడ్డానికి ఏమీ లేదన్నట్లుగా.

" వస్తాను సార్!" అని ఆ ఫోటోలు తీసుకొని ఇంటికెళ్లి బాగా ఆలోచించి నేరుగా మంత్రిణి భానుమతి ఇంటికెళ్ళి సుందరయ్య చెప్పిందంతా ఆమెతో చెప్పాడు . అంతా విన్న తర్వాత, "చూడు బాబూ! గతంలో నేను క్యాబర్ డాన్సర్ అన్నమాట అక్షరాలా నిజం కానీ నేను క్యాబరేతో సంపాదించిన ఒక్క పైసా కూడా నా స్వంతానికి ఎప్పుడూ ఉపయోగించలేదు. కన్నూమిన్నూ తెలియక కొవ్వెక్కి క్లబ్బులకొచ్చే వాళ్ళకు నాఒళ్ళు చూపి సంపాదించిన డబ్బును ఒళ్ళు దాచుకోవడానికి కూడా గతిలేని పేద ప్రజలకు పంచేదాన్ని.

అందువల్ల నన్ను వాళ్ళు అభిమానంతో ఎన్నికల్లో పోటీ చెయ్యమన్నారు. వారందరి అభిమానంతో గెలిచాను. మంత్రిణి అయ్యాను. నా వంతు కర్తవ్యంగా నాచేతనైన సహాయం ప్రజలకు చేస్తున్నాను. రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలై, మంత్రులై తమ బాధ్యతలు విస్మరించి ప్రజల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నప్పుడు ఓ క్యాబరే డాన్సర్ ప్రజల అభిమానంతో ఎన్నికల్లో గెలిచి నిజాయితీగా ప్రజాసేవ చెయ్యడం తప్పాబాబూ ?" అని ఆగి, "ఒక్క నిమిషం" అని ఇంట్లోకెళ్ళి ఓడైరీ చేతబట్టుకొని వచ్చి -"ఈ డైరీలో క్యాబరే డాన్సర్‌గా నా నిజజీవితం ఏమిటో సవివరంగా రాసి వున్నాను. బాగా చదివి దీన్నే ఓ ఆర్టికల్‌గా ప్రచురించు. నాకే అభ్యంతరమూ లేదు" అని డైరీ రమేష్ చేతికిచ్చింది భానుమతి. ఏం మాట్లాడాలో తెలియక రమేష్ "వస్తానమ్మా !" అని పోయాడే తప్ప ఇంకేం మాట్లాడలేదు.

మరుసటి రోజు ఉదయాన్నే పేపరు చేతికి తీసుకున్న సుందరయ్య కంటికి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రమేష్ రాసిన సెన్సేషనల్ న్యూస్ లోపలి పేజీల్లో అని రాసుండడం కన్పించేసరికి -"ఈ రోజుతో భానుమతి రాజకీయ జీవితం క్లోజ్ " అని అనుకుంటూ పేజీ తిప్పేసరికి వెయ్యి ఓల్టుల కరెంటు షాక్ కొట్టినట్లు అదిరి పడ్డాడు అందుకు కారణం -"పిక్ పాకెటర్‌గా ఫుట్‌పాత్ జీవితం ప్రారంభించి ప్రతిపక్ష నాయకుని స్థాయికి ఎదిగిన సుందరయ్య జీవిత చరిత్ర మొదటి భాగం "అని అందంగా బాక్స్ కొట్టిన న్యూస్ ప్రచురించి వుండడమే !
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

Show comments