Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాటిచెట్టు నీడ

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:31 IST)
తల్లి తెచ్చే చాలీచాలని కూలిగింజల్ని .. ఆ తల్లే గంజి కాచి పోస్తున్నా పాపం పైడితల్లికి ఆకలి తీరడంలేదు.. ఎలాగోలా అర్ధాకలితో నిద్రపోదామన్నా.. ఆకలినైతే అణచుకోగలుగుతున్నాడు కానీ .కడుపు నొప్పిని అణచుకోలేకపోతున్నాడు. కడుపునొప్పి బాధతో మూలుగుతున్న పైడితల్లి వద్దకు శరభయ్య వచ్చి ..
" ఒరే వెంగీ! ప్రక్కఊర్లో ఎవరో స్వామి వచ్చి అన్ని జబ్బులకు డబ్బులు తీసుకోకుండా మందులిస్తున్నాడట. వెళ్ళి నువ్వు కూడా మందు తీసుకొని నీ కడుపు నొప్పిని తగ్గించుకోరా..! తర్వాత హాయిగా కూలి చేసుకుని సంపాదించుకోవచ్చు" అని చెప్తున్న పోలయ్య మాటలు ఓ రకంగా పన్నీటి జల్లులే అయ్యాయి వెంగయ్యకు.
" తను ఎలాగూ డబ్బిచ్చి వైద్యం చేయించుకోలేడు..డబ్బులేకుండా స్వామి యిచ్చే మందు తీసుకోవడం పెద్ద కష్టమూ కాదు. కాకపోతే ప్రక్కఊరివరకు ఎలాగో నడచి వెళ్తే చాలు" అనుకున్నాడు.

మరుసటిరోజు తల్లిని కూలికి పంపించి...తను ప్రక్క ఊరికి వెళ్ళి స్వాములవారిచ్చిన మందు తిని ఎండమీదే తిరుగు ముఖం పట్టాడు పైడితల్లి. ఎండవల్ల ఒంటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ నడుస్తున్న పైడితల్లికి రెండు తాటిచెట్లు కన్పించేసరికి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని వాటి నీడనకూర్చున్న పైడితల్లికి గతం గుర్తుకు రాసాగింది. ..
ఇంట్లో వున్న అందరి పాలేర్లకంటే పైడితల్లిని ఎంతో స్పెషల్‌గా చూసేవాడు భూస్వామి ఎర్రన్నాయుడు. అలాంటి పైడితల్లి జబ్బుచేసి ఓ నెల పనిలోకి రాక తర్వాత జబ్బు నయం చేయించుకుందామనుకొని తల్లితో ఎర్రన్నాయుడు యింటికి వెళ్ళి..
" దొరా! కొంత పైకం యిప్పిస్తే పట్నం వెళ్ళి వైద్యం చేయించుకుంటాను" అంటూ వినయంగా అడిగాడు. "పైడితల్లి! నువ్వు ఓ నెల పనికి నామం పెట్టావు. అందుకని కుంటిగాడిని నీ స్థానంలో పనికి పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు జబ్బు నయం చేసుకున్నా తిరిగి మునుపటిలా పనిచేయలేవు కాబట్టి నువ్వు మన ఊరి ఆచారి మందు తిని జబ్బు నయం చేసుకో.. డబ్బుమాత్రం నన్ను అడగొద్దు." ఖండితంగా తెగేసి చెప్పిన ఎర్రన్నాయుడుగారిని ఏమీ చేయలేక తల్లితో తిరిగి వుసూరుమంటూ యింటి వైపు నడక సాగించాడు..
వీపు మీద ఎండ చురుక్కుమన్పించడంతో వాస్తవంలోకి వచ్చిన పైడితల్లి తన చుట్టూ ఎండ వుండడం గమనించి .." ఓ పదినిముషాలు కూడా స్థిరంగా నీడను యివ్వలేదు ఈ తాటిచెట్టు" అనుకున్నాడు మనస్సులో.. లేచి ఊరివైపు నడుస్తున్న పైడితల్లి...
" తాటిచెట్టు నీడా భూస్వాముల పొత్తూ రెండూ ఒకటే.. ఏవీ స్థిరంగా వుండవు. జబ్బు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ..ఎవ్వరికీ పాలేరుగా కుదరకుండా రోజూ కూలిచేసుకొని సంపాదించుకోవాలి "అనుకొన్నాడు మనస్సులో స్థిరంగా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

Show comments