Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకి సాక్షిగా

Webdunia
" రేయ్! తాళం తీరా" సెల్ లోపల నుంచి సింహంలా గర్జించాడు బాబురావు. "ఎందుకు గురూ! తమరికి ఏం కావాలన్నా ఇక్కడికే సప్లై చేస్తున్నాంగా" నైట్ పోలీస్ స్టేషన్ సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ జోగినాధం ఎంతో వినయంగా చెప్పాడు. "స్టేషన్‌లో ఎంజాయ్ చేస్తే ఆనందం వుండదురా. తలుపు తీయ్ బయటకెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను" మళ్ళీ గర్జించాడు బాబురావు.

బాబురావు ఆ ఊర్లో పేరుమోసిన గూండా. నెలకో మర్డరైనా చేస్తుంటాడు. అదీ పోలీసుల, రాజకీయ నాయకుల సాక్ష్యంతోనే. అందుకనే అతడికి పోలీస్ స్టేషన్‌లో ఎంతో గౌరవం, విలువ వుంది. 'కూతురి పెళ్ళికి కట్నం ఎక్కువ మొత్తంలో అడుగుతున్నారు. ఈ బాబురావుగారిని ఏదైనా సహాయం చెయ్యమని అడిగితే?" అని ఆలోచించసాగాడు.

అతని ఆలోచనల్ని చెదరగొడుతూ - "ఏంట్రా తలుపు తీయమని చెప్పి ఎంతసేపైంది?" గట్టిగా గర్జించాడు బాబురావు. వెంటనే సెల్ తలుపులు తెరచి వినయంగా వంగొని నిలబడి చేతులు నలుపుకోసాగాడు జోగినాధం. "ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్లున్నావ్?" సిగరెట్ వెలిగించుకొని ప్రశ్నించాడు బాబురావు.

" ఏం లేదు గురూ!. అమ్మాయి పెళ్ళి చేయాలి... కట్నం ఎక్కువ అడుగుతున్నారు .." అని నసిగాడు. "కట్నం డబ్బు నేను సర్దుతాను. రేపట్నుంచే పెళ్ళి ఏర్పాట్లు చేసుకో...నేను వెళ్ళొస్తా" అని స్టేషన్‌ నుండి బయటకు వెళ్ళసాగాడు. "గురూ! తొందరగా వచ్చెయ్యండి గురూ!" నెత్తి మీద టోపీ చేతికి తీసుకొని వంగి మరీ చెప్పాడు జోగినాధం. "అలాగే లేరా" అని నవ్వుతూ వెళ్ళిపోయాడు బాబురావు.

" రేయ్ నిద్రలెయ్‌రా మొద్దు వెధవా!" తెల్లవారుజాముకి వచ్చి జోగినాధంని నిద్రలేపాడు బాబురావు. "సెల్ తలుపులు వేసుకోరా" అన్నాడు బాబురావు సెల్లోకి వెళ్ళి సెల్‌కి తాళం వేస్తున్న జోగినాధంతో- " చూడు రాత్రి మంచి మందులో వుండగా ఒక గుంటొకటి రిక్షాలో వెళ్తూ కన్పించింది. సరదాగా రేప్ చేశాను. ఆ తర్వాత చూస్తే నా దగ్గరి కత్తి లాక్కుని నన్ను పొడవబోయింది. అందుకని ఫినిష్ చేశాను.

ఆ.. ఇదిగో ఈ డబ్బు కట్నం కింద నీ కూతురికిచ్చి పెళ్ళి చేయ్" అని వందనోట్ల కట్ట జోగినాధంకిచ్చాడు. "నీ రేప్ మర్డర్ విషయం బయటకు పొక్కనివ్వకుండా నా టోపీ అడ్డేసి కాపాడుతా గురూ!" నోట్ల కట్ట కళ్ళకి అద్దుకుంటూ చెప్పాడు జోగినాధం. నైట్ డ్యూటీ పూర్తి చేసికొని బాబురావు ఇచ్చిన నోట్లకట్టను ఆనందంగా తడుముకుంటూ సైకిలెక్కి ఇంటి వైపు సాగాడు జోగినాధం.

ఇంటిముందు గుమికూడి వున్న జనాన్ని చూసి సైకిల్ దిగి-"ఏమైందని" ఆతృతపడుతూ ఇంటిలోకి వెళ్ళబోయిన జోగినాధం కాళ్ళని కట్టి పడేసింది ఇంటి ముందున్న కూతురు శవం. "రాత్రి సినిమా నుంచి రిక్షాలో ఇంటికొస్తున్న అమాయకురాల్ని ఎవరో తాగుబోతు రేప్ చేసి మరీ చంపేశాడట. ఈ పోలీసోళ్ళు వుండి కూడా లాభం లేదు" గుంపులోంచి ఎవరో అన్న మాటలు జోగినాధం చెవినపడ్డాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

Show comments