యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోతగా విశాల్ - రత్నం ట్రైలర్

డీవీ
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (18:08 IST)
Visal- Ratnam
మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో  రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా  ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు. 
 
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆధరణను దక్కించుకున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన రత్నం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.  రత్నం ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ,తమిళనాడు బార్డర్ గొడవల ఆధారంగా ఈ కథ నడిచేలా ఉంది. ఇక హీరోయిన్ కోసం హీరో చేస్తున్న ఊచకోతను చూస్తుంటే మాస్ యాక్షన్ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్‌కు పండుగలానే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో దేవీ శ్రీ ప్రసాద్ ఆర్ఆర్ అదిరిపోయింది. యాక్షన్, లవ్ సీన్లకు తగ్గట్టుగా మంచి ఆర్ఆర్ ఇచ్చారు.
 
కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments