Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VakeelSaabOnApril9th​ అదిరిపోయిన "వకీల్ సాబ్" ట్రైలర్

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (20:31 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం సాయంత్రం రిలీజ్ అయింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ కల్యాన్‌ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. 
 
ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్‌ ట్రైలర్‌ను మార్చి 29న విడుదల చేశారు. 
 
థియేటర్లలో ఒక పండగలా.. ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్‌ రాజ్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. 
 
ఇకపోతే, టైటిల్‌కి తగినట్లే స్టార్టింగే కోర్టు సీన్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై పవన్‌ కల్యాణ్‌, ప్రకాష్‌ రాజ్‌‍‌ల మధ్య వాద, ప్రతివాదనలతో కోర్ట్‌ సీన్‌ దద్దరిల్లిపోయేలా స్టార్ట్‌ అయిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేదిగా ఉంది. 
 
పవన్‌ చెప్పే డైలాగ్స్‌ విషయంలో దర్శకుడు శ్రీరామ్‌ వేణు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే తెలిసిపోతుంది. అన్యాయంగా కేసులో బుక్కయిన ముగ్గురు అమ్మాయిలు.. న్యాయం కోసం పోరాడి పోరాడి విసిగిపోయిన టైమ్‌లో.. లాయర్‌ రూపంలో పవన్‌ వారికి దేవుడిలా కనిపించడం.. వారి తరపున వాదించి.. వారిని ఎలా ఈ కేసులో నుంచి బయటికి తీసుకువచ్చాడు అనేదే స్టోరీ అనేది అర్థమవుతుంది. 
 
కానీ.. కోర్టు సీన్స్‌ ఈ సినిమాకి చాలా ప్రత్యేకం అనేది ట్రైలర్‌ చెప్పేస్తుంది. ఇక పవన్‌ కల్యాన్‌ కనిపించిన తీరు.. వాదించిన విధానం అన్నీ హైలెట్‌గా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రకాష్‌ రాజ్‌ కూడా పవన్‌కి గట్టి పోటీనిచ్చే న్యాయవాది పాత్రలో.. మరోసారి నందాగా (బద్రిలో అదే పేరు) తన సీనియారిటీని ప్రదర్శించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments