Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా వాస్తవం టీజర్

డీవీ
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (16:00 IST)
Meghashyam - Rekha Nirosha
మేఘశ్యాం, రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా అంజనిసూట్ ఫిలిమ్స్ సంస్థ పై ఆదిత్య ముద్గల్ నిర్మాతగా జీవన్ బండి దర్శకత్వంలో వస్తున్న సినిమా వాస్తవం. ఈ సినిమాకి పెద్దపల్లి రోహిత్ (పి. ఆర్) మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన ఫస్ట్ లుక్  సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఈరోజు రిలీజ్ అయిన టీజర్ కి సినిమా పైన అంచనాలు పెంచేస్తోంది.
 
ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ : ఈ సినిమా ఇష్టంతో చాలా కష్టపడి తీసాం. డైరెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ : ఈ కథ నేను చెప్పినప్పుడు నన్ను నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్టులు నాకు చాలా సపోర్ట్. పి. ఆర్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖ నిరోషా చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ : మా సినిమా లో చాలా మంచి కంటెంట్ ఉంది కాని సరైన సపోర్ట్ లేదు. మీడియా ప్రేక్షకులే మాకు సపోర్ట్. ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అందరికీ నచ్చే కథ అవుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీ సపోర్ట్ ఆశీస్సులు మాపై ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో మేఘశ్యాం మాట్లాడుతూ : నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఎక్కడ కథ నుంచి డివియేట్ అవ్వకుండా చాలా బాగా కథని తీసుకుని వచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి డైరెక్టర్ జీవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కూల్చేయాల్సిందే.. విజయ సాయిరెడ్డి

తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం - శ్రీధర్ బాబు

దశాబ్దం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

మైనర్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments