Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్లింగ్ కోర్టు డ్రామాగా వ్యవస్థ ట్రైల‌ర్‌

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (19:28 IST)
Karthik Ratnam, Sampath Raj, Hebba Patel
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో క‌ట్టి ప‌డేసే కోర్టు రూమ్ డ్రామా  ‘వ్యవస్థ’. జీ 5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న జీ 5లో వ‌చ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. 
 
వ్య‌వ‌వ‌స్థ‌ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా   జీ 5 గురువారం విడుద‌ల చేసింది.  అందులో ఈరోజు న్యాయం రేప‌టి క్రైమ్ అయితే నేటి క్రైమ్ రేప‌టి చ‌ట్టం అవుతుంది అని ఓ లా కోర్సు ట్రైన‌ర్ త‌న స్టూడెంట్స్‌కు చెప్ప‌టంతో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. సంప‌త్ రాజ్ ఇందులో చ‌క్ర‌వ‌ర్తి అనే చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చేసిన‌ట్లు తెలుస్తుంది. సిటీలోని లాయ‌ర్స్ అంద‌రూ త‌న జూనియ‌ర్స్‌గా నియ‌మించుకుని వార‌పై అజ‌మాయిషీ సంపాదించ‌టం ద్వారా త‌ను చెప్పిందే జ‌రగాల‌నుకునే వ్య‌క్తిగా క‌నిపిస్తారు. 
 
యువ న‌టుడు కార్తీక్ ర‌త్నం ఇందులో కొన్ని నియమ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌ని చేసే మంచి మ‌న‌సున్న జూనియ‌ర్ లాయ‌ర్ వంశీ పాత్ర‌ను పోషించారు. తను న‌త్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు. దీని వ‌ల్ల త‌న‌ని తాను త‌క్కువ‌గా ఊహించుకుంటుంటాడు. అయితే త‌ను హ‌త్యా నేరం మోప‌బ‌డిన యామిని అనే అమ్మాయిని కాపాడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో సిటీలోనే అతి పెద్ద లాయ‌ర్‌గా పేరు తెచ్చుకున్న చ‌క్ర‌వ‌ర్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. స‌మాజంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి యామినిని కాపాడ‌టానికి ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌తాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments