మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

డీవీ
గురువారం, 16 మే 2024 (16:36 IST)
Raj Tarun, Hasini Sudhir
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.
 
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా వర్క్ చేశారు. జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు.
 
హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ, రాజ్ తరుణ్ షూటింగ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేశారు. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో హెల్ప్ చేశారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments