Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్‌ రిలీజ్

దేవి
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (17:46 IST)
V.J. Sidhu, Indumati Manikandan
AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో  బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఒరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
 
ఈ ట్రైలర్‌లో అన్ని రకాల అంశాలను జోడించారు. యూత్‌కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. బాధత్యారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లను చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
 
ఈ చిత్రంలో కె. యస్. రవికుమార్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మిస్కిన్‌ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా అర్చన కల్పాతి, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఐశ్వర్య కల్పాతి  పనిచేస్తున్నారు.
 
లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎమ్. వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వి.జె. సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదు ... జస్ట్ విరామం మాత్రమే : రాజ్‌నాథ్ సింగ్

Covid-19: వేసవి నుంచి వర్షాకాలానికి ఎంట్రీ.. కోవిడ్-19తో పాటు జబ్బులతో జాగ్రత్త!

ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్‌లో 300 ఎకరాల్లో లేడీస్ హాస్టల్స్

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments