Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిష్ ఆవిష్క‌రించిన‌ `పీన‌ట్ డైమండ్` ట్రైలర్

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (16:21 IST)
Krish, Abhinav Sardhar
వ‌జ్రాన్నిత‌యారుచేయాల‌నే ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది? అన్న పాయింట్‌తో `పీన‌ట్ డైమండ్` రూపొందుతోంది. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై రూపొందిందుతోంది. అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లు. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. 
 
ఈ చిత్రంలోని పాటను ఇటీవ‌లే హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు..
 
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ,`పీన‌ట్ డైమండ్`టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది. రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను..ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

మూర్ఖులు మారరా? భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments