నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ కాప్షన్ తో ఓంభూబుష్ చిత్రం రూపొందింది. శ్రీహర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా యు.వి. క్రియేషన్స్ రూపొందించింది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో నాసా డ్రెస్ లో బైరవపురం అనే గ్రామానికి డాక్టర్లుగా వెళ్ళిన రాహుల్, శ్రీవిష్ణు, ప్రియదర్శి ముగ్గురు వ్యక్తులు అక్కడ ఓ నిధిని కనిపెడతారు. ఆ క్రమంలో ఏ జరిగిందనేది కథగా చెప్పబడింది.
అనంతరం రాహుల్ మాట్లాడుతూ, దర్శకుడు నేను నారాయణ గూడ కాలేజీ చదివాం. కాలేజీ లోపలికంటే బయట గేటు దగ్గరే వుండేవాళ్ళం. బేవార్స్ గాళ్ళగా వున్న మేము సినిమా రంగంలో రాణించాం. దర్శకుడు హుషారు కథ చెప్పాడు. చేశాం. చాలా కాలం తర్వాత ఓంభీమ్ బుష్ కథ చెప్పాడు. ఇందులో లాజిక్ ఎక్కుడుంది. అసలు కథేమిటి? అని అడిగాను. నువ్వు ఉన్నావ్ చాలు అన్నాడు. ఆతర్వాత శ్రీవిష్ణు, ప్రియదర్శి కూడా కథవిన్నాక ఏం కథ లాజిక్ లేదు అన్నాడు. మనం వున్నాం కదా అని తర్వాత మాకుమేమే సర్దిచెప్పుకుని నటించాం అన్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ, ఈ సినిమా కథను ప్రపంచంలోని ఏ భాషలోనైనా విడుదలచేయవచ్చు. ఇది పాన్ వరల్డ్ కథ అంటూ తప్పకుండా అన్నిభాషల్లో విడుదలచేుయాలనుందని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ, కరోనా టైంలో రాసుకున్న కథ ఇది. బయటకు రావడానికి చాలా కాలం పట్టింది. ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు. వెన్నెల కిశోర్ పాత్ర కీలకం. ఆ పాత్ర ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు తప్పకుండా ఎదురుచూస్తారు. ఈనెల 22 న సినిమా విడుదలవుతుంది అన్నారు.