ఓం భీమ్ బుష్ తో నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి : హీరో శ్రీవిష్ణు

డీవీ
శుక్రవారం, 15 మార్చి 2024 (18:43 IST)
Sree Vishnu, Priyadarshi, sunil balusu and others
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ ‘ఓం భీమ్ బుష్’  ట్రైలర్ గ్రాండ్ గా శుక్రవారం హైదరాబాద్ లో ఏ. ఏ. ఏ. థియేటర్ లో విడుదల అయింది  శ్రీవిష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సామజవరగమనతో ఇంత పెద్ద హిట్ కొట్టినప్పటికీ, నవ్వులు పంచడానికి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు సమానమైన స్థానాన్ని కల్పించిన శ్రీవిష్ణును తప్పకుండా అభినందించాలి. వారి స్పాంటేనియస్ డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణనిచ్చాయి.

ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా కనిపించగా, బ్యాంగ్ బ్రోస్ పాటలో ప్రియా వడ్లమాని అలరించింది శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. మార్చి 22న థియేటర్స్ కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్స్ తో వెళితే ఇంక బాగా ఎంజాయ్ చేస్తారు. 22న ఎవరూ మిస్ అవ్వదు. మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు. కేవలం ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన యువీ వంశీ అన్నకి, సునీల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు హర్ష చాలా హిలేరియస్ గా సినిమాని తీశారు. సినిమా యూనిట్ అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
 
చిత్ర దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ.. ట్రైలర్ లో వుండే ఎనర్జీ కంటే సినిమాలో వందరెట్ల ఎనర్జీ వుంటుంది. మార్చి 22న అందరూ గ్యాంగ్స్ తో రండి. టెన్ టైమ్స్ ఎంటర్ టైన్ అవుతారు. అది మా గ్యారెంటీ. మార్చి 22న కలుద్దాం’’ అన్నారు.
నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ..‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా అందరూ చూడాలి’’ అని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments