Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

దేవి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (11:55 IST)
Hit 3 teaser poster
నాని క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్  చిత్ర టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌తో మేకర్స్ వచ్చారు. ఈ చిత్రం ఇంటెన్స్ టీజర్‌ను ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రధాన కథాంశం, నాని పోషిస్తున్న ఫెరోషియస్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ తో పాటు మిగతా పాత్రల గురించి కీలక వివరాలను ఆవిష్కరించడానికి టీం సిద్ధంగా ఉంది.
 
టీజర్ పోస్టర్ లో నాని చేతిలో గొడ్డలి పట్టుకొని, తన పాదాల దగ్గర పడిపోయిన మనుషులతో కమాండింగ్ పోజిషన్ లో కనిపిస్తున్నారు. ఈ బోల్డ్ ఇమేజ్ అతని పాత్ర యొక్క ఫెరోషియస్ అండ్ ఇంటెన్స్ నేచర్ ని తెలియజేస్తోంది.
 
డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. 
 
ఈ చిత్రంలో నానికి జోడిడా శ్రీనిధి శెట్టి కథానాయిక పాత్రలో నటించింది. ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. 
 HIT 3 మే 1, 2025న థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments