Webdunia - Bharat's app for daily news and videos

Install App

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

డీవీ
శనివారం, 15 జూన్ 2024 (20:12 IST)
OMG (O Manchi Ghost)
వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది
 
‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందరినీ చంపేస్తోందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’.. అని ఓ గ్యాంగ్ పిశాచీపురంలోకి ఎంటర్ అవ్వడంతో ట్రైలర్‌లో ఫన్ ఎలిమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. 'ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం..' అంటూ అసలైన హారర్ బొమ్మని చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతలా నవ్విస్తారో.. అంతలా భయపెట్టించేలా ఉన్నారు.
 
ట్రైలర్ చూసిన తరువాత అందరికీ ఓ విషయం అర్థం అవుతుంది. ఈ సినిమాలో కామెడీ, సూపర్ నేచురల్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉన్నాయని తెలుస్తుంది. ట్రైలర్ నవ్వించడమే కాదు భయపెట్టేసేలా ఉంది. నందితా శ్వేత దెయ్యం పాత్రలో భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు.
 
అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అస్సెట్‌ కానుంది. ఈ సినిమా జూన్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
 
తారాగణం: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments