Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత పని చేశావ్ చంటి చిత్రం ఆడవాళ్లకు మాత్రమే అంటున్న దర్శకుడు ఉదయ్ కుమార్

డీవీ
గురువారం, 22 ఆగస్టు 2024 (14:49 IST)
Srinivas Ulishetty, Diyaraj, Neeharika
"తస్మాత్ జాగ్రత్త" చిత్రంతో దర్శకుడిగా పరిచయయిన ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన  చిత్రం "ఎంత పని చేశావ్ చంటి". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్, నిర్మాతల మండలి హాల్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిధిగా విచ్చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి, వైజాగ్ కు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, మరింతమందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
 
ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ ఉలిశెట్టి, హీరోయిన్లు దియారాజ్, నీహారిక శాంతిప్రియ, నిర్మాతలు లడ్డే బ్రదర్స్, డి.ఓ.పి. సంతోష్, నటుడు త్రినాథరావు, కో-డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ పాల్గొని, తమ చిత్రం ట్రైలర్ విడుదల చేసి, విషెస్ తెలిపిన త్రినాథరావు నక్కినకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ... "ఎంత పని చేశావ్ చంటి" చిత్రాన్ని మగవాళ్ళు చూడకూడదని, ఈ చిత్రం కేవలం ఆడవాళ్లకు మాత్రమేనని పేర్కొన్నారు.
 
జబర్దస్త్ అప్పారావు, భాస్కరాచారి, అమ్మరాజా, నవ్వుల దామోదర్, ఎమ్.టి.రాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్టిల్స్: రామకృష్ణ - లోకేష్, మేకప్ ఛీఫ్: ఎమ్.డి.మల్లిక, పాటలు: తుంబలి శివాజీ, సంగీతం: పవన్ - సిద్దార్ద్, కొరియోగ్రఫీ: మురళీకృష్ణ -నీహారిక, ఎడిటర్; శ్యామ్ కుమార్, సినిమాటోగ్రాఫర్: సంతోష్ డి.జెడ్, కో-డైరెక్టర్: బత్తిన సూర్యనారాయణ, కథ -మాటలు: ప్రసాదుల మధుబాబు, సహనిర్మాత: రాము, నిర్మాతలు: లడ్డే బ్రదర్స్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఉదయ్ కుమార్!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments