Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా దేవ్‌గిల్ పాన్ ఇండియా చిత్రం అహో! విక్రమార్క

డీవీ
బుధవారం, 21 ఆగస్టు 2024 (18:59 IST)
Devgil
మగధీర ఫేమ్  దేవ్ గిల్ హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’. ఆగ‌స్ట్ 30న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.
 
ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అసుర అనే విల‌న్ ఓ ప్రాంతాన్ని త‌న కంట్రోల్‌లో పెట్టుకుని ఉంటాడు. అక్క‌డి ప్ర‌జ‌లు అత‌ను చెప్పింది వినాల్సిందే. లేకుంటే వారికి చావే గ‌తి. అలాంటి వాడిని ఎదిరించ‌టానికి పోలీసుల‌కే గుండె  ధైర్యం ఉండ‌దు. కానీ చెడుని అంత మొందించ‌టానికి మంచి ఏదో ఒక రూపంలో వ‌స్తుంది. అలాంటి అసురుడిని అంతమొందించ‌టానికి ఆ ప్రాంతంలోకి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ వ‌స్తాడు. త‌నేం చేశాడు.. ఎలా విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్టాడు.. అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 30న విడుద‌ల‌వుతున్న సినిమా చూడాల్సిందే.
 
ఈ సంద‌ర్భంగా దేవ్ గిల్ మాట్లాడుతూ ‘‘ ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆగస్ట్ 30న సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్ష‌కులు మ‌రో కోణాన్ని వెండితెర‌పై చూస్తారు " అని పేర్కొన్నారు.
 
దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘‘అహో! విక్రమార్క' ద్వారా, భాష, సంస్కృతులను, వీరత్వం, త్యాగం సారాంశాన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం.  పోలీసుల పవర్‌ను తెలియ‌జేసేలా సినిమాను  అనుకున్న ప్లానింగ్ ప్రకారం రూపొందించాం. సరికొత్త దేవ్ గిల్‌ను చూస్తారు ’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments