Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెందొర - చెర్రీ బర్త్‌డే స్పెషల్ ఇదే

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (16:32 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27వ తేదీని పురస్కరించుకుని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినీలోకానికి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) నుంచి అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్‌లో 1.13 నిమిషాల నిడివివున్న ఫస్ట్‌లుక్ టీజర్‌ను తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్ర యూనిట్ రిలీజ్ చసింది. 
 
ఈ టీజర్‌లో "ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే చావుకైనా చెమటలు ధారకడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న... మన్నెం దొర... అల్లూరి సీతారామరాజు" అంటూ ఎన్టీఆర్ పరిచయం సాగింది.
 
ఇక ఇందులో రామ్ చరణ్ కసరత్తులు, ధ్యానం చేయడం తుపాకి, బాణాలను ప్రయోగించడం వంటి దృశ్యాల కట్స్ కనిపిస్తున్నాయి. విడుదలైన రెండు నిమిషాల వ్యవధిలోనే తెలుగు వర్షన్ వ్యూస్ లక్ష దాటింది. తమిళ్, హిందీ, కన్నడ, మళయాల భాషల్లోనూ ఇదే ఫస్ట్ లుక్ విడుదలైంది.
 
టాలీవుడ్ యాక్ట‌ర్ రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స‌ర్ ఫ్రైజ్ వీడియోను విడుద‌ల చేస్తాన‌ని ఎన్టీఆర్ ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. రామ‌రాజు కోసం భీమ్ ఇవ్వ‌నున్న గిఫ్ట్ సాయంత్రం 4 గం.ల‌కు విడుద‌ల చేశాడు. రాంచ‌ర‌ణ్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ వీడియోను షేర్ చేశాడు ఎన్టీఆర్‌.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments