Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై కట్టప్పా కిల్డ్ బాహుబలి ప్రశ్నను మించిన సంచలనం ఇప్పుడు వైరల్..?

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ తొలి భాగంలో ఎదురైన ప్రశ్న ఈరోజుకీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఉద్వేగంలో ముంచెత్తుతోంది. ఇప్పుడు దానికిమించిన ఉత్కంఠను బాహుబలి-2 ట్రైలర్‍‌లోని ఆ దృశ్యం కలిగిస్తోంది. పైగా కోట్లమంది వీక్షకులు ఆ దృశ్యాన్ని ఎవరికి వారు

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (01:25 IST)
బాహుబలి తొలి భాగం విడుదలైనప్పటినుంచి బాహుబలి రెండోభాగం ఎప్పుడెప్పుడొస్తుందా అని జనం కళ్లు కాయలు గాచేలా చూస్తున్నారు. ఈ నేపధ్యంలో బాహుబలి-2 ట్రైలర్ విడుదల చేయగానే అది ఇంటర్నెట్‌‌లో కనీ వినీ ఎరుగని క్రేజి్‌ని సృష్టించింది. ఇప్పటికే 10కోట్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఈ ట్రైలర్‌లో ప్రత్యేకించి ఒక దృశ్యం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా వారిలో తీవ్ర ఉత్కంఠను రగిలిస్తోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ తొలి భాగంలో ఎదురైన ప్రశ్న ఈరోజుకీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఉద్వేగంలో ముంచెత్తుతోంది. ఇప్పుడు దానికిమించిన ఉత్కంఠను బాహుబలి-2 ట్రైలర్‍‌లోని ఆ దృశ్యం కలిగిస్తోంది. పైగా కోట్లమంది వీక్షకులు ఆ దృశ్యాన్ని ఎవరికి వారు అనుకరిస్తూ చిత్రంతో తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు.
 
ఏంటా దృశ్యం అంటే రెండో భాగం ట్రైలర్ ప్రారంభంలోనే ప్రభాస్ డైలాగ్ మొదలవుతుండగానే చాలామంది గ్రామీణులు దిగ్భ్రాంతితో ఒకే దిశగా చూస్తూ అలా నిలబడిపోయిన దృశ్యం. ఈ దృశ్యం చూసిన జనాలను ఎంతగా వినోదింప చేస్తోందంటే ప్రతి ఒక్కరూ దాన్ని అనుకరించి తామూ షాక్ కలిగినట్లు ఫోజు పెడుతూ దాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్‌లో తుఫాను సృష్టిస్తోంది. 
 
గత రెండేళ్లుగా అంటే 2015లో బాహుబలి ఒకటో భాగం విడుదలైనప్పటినుంచి ఇంటర్నెట్‌లో ఈ సినిమాలోని దృశ్యాలను అనుకరిస్తూ, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ విచ్చలవిడిగాజోక్స్ వేస్తూ నవ్వుకుంటున్నారు. తమ నవ్వులు అందరికీ పంచుకుంటున్నారు. ఆ రోజు నుంచి నేటివరకు బాహుబలి ఫీవర్ జనాలను వదలిపెట్టడం లేదు.
 
చివరకు ఈ ఫీవర్ ప్రధాని నరేంద్రమోదీని సైతం వదిలిపెట్టలేదంటే బాహుబలి చిత్రం జనాల్లో కలిగిస్తున్న మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ బాహుబలిని చూశారా అందులో నేను కట్టప్పలాంటివాడిని, ప్రజలకు కట్టప్పలాగా సేవ చేస్తా అంటూ మోదీ చేసిన ప్రకటన సంచలనం గొలిపించింది.  
 
200 కోట్ల బడ్జెట్‌తో తీసినట్లు చెబుతున్న బాహుబలి రెండో భాగం ఇప్పటికే రూ. 500 కోట్లు సంపాదించిందని అంటున్నారు. సినిమా విడుదలకు ముందే శాటిలైట్ ప్రసారాలు, పంపిణీ హక్కుల కిందే నిర్మాతలకు ఇంత ఆదాయం లభించినట్లు చెబుతున్నారు. ఆర్కా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్క, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించాు. 2017 ఏప్రిల్ 28న విడుదల కానున్న బాహుబలి-2 సినిమాకోసం ప్రపంచం యావత్తూ ఎదురు చూస్తోందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments