Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని ఆవిష్క‌రించిన అశోక్ సెల్వన్ ఆకాశం ట్రైలర్

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (12:20 IST)
Ashok Selvan, Sivatmika
యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై  ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌. ఈ సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కి విషెష్ తెలియజేశారు.
 
రీసెంట్‌గా విడుదల చేసిన ‘ఆకాశం’ టీజర్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
 
అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కనిపించారు. అతని లైఫ్‌లో మూడు దశల్లోని జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక పాత్రలను తీర్చి దిద్దిన తీరు, వాటిని వారు క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
 
ప్రేమ, మోసం సహా లైఫ్‌లోని ఇతర భావోద్వేగాలు హీరో అశోక్ సెల్వన్ రోలర్ కోస్టర్‌లా ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది సినిా అని స్పష్టంగా తెలుస్తోంది. దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. ట్రైలర్‌లో విదు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్, గోపి సుందర్ సంగీత సారథ్యం వహించిన  బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించినట్లు స్పష్టమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments