జ్యోతిక నటించిన అమ్మ ఒడి చిత్ర ట్రైలర్ కు స్పందన

డీవీ
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (17:04 IST)
teacher Jyothi
జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం *రాక్షసి*. ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో *అమ్మ ఒడి* టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా సోమవారం తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ గా జ్యోతిగా కనిపిస్తున్నారు. పాడైపోయిన స్కూళ్లను..  పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.  
 
ఈ సందర్భంగా వడ్డి రామానుజమ్, వల్లెం శేషారెడ్డి మాట్లాడుతూ.."తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉంది. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను చూపించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ రాజ్ అద్భుతంగా రూపొందించారు. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం" అని చెప్పారు.
నటీనటులు : జ్యోతిక, నాగినీడు, హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments